వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 4: వికారాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ రానున్న ఎన్నికల్లో మరోసారి భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని వికారాబాద్ బిఆర్ఎస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు ముర్తుజా హాలీ దీమా వ్యక్తం చేశారు. వికారాబాద్ అభివృద్ధిపై అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరిగిన ఈ ప్రాంత అభివృద్ధిపై గలమెత్తి ప్రాంత అభివృద్ధి కోసం సమస్యలను ప్రసాదించి వాటిని పరిష్కరిస్తూ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే ఆనంద్ ప్రజల ఆశీర్వాదంతో మరోసారి విజయం సాధించడం ఖాయమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వారి అభివృద్ధికి బాటలు వేస్తున్నారని అదేవిధంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఎంతో ప్రణాళికతో ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారని రైతు సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మూడవసారి మళ్లీ విజయం సాధించి ముఖ్యమంత్రి కావడం ఖాయమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో వికారాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే ఆనంద్ విజయాన్ని ఎవరు ఆపలేరని పేర్కొన్నారు. స్థానికుడైన వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. గతంలో ఈ నియోజకవర్గంలో వరుస విజయాలు సాధించిన వారే తప్ప ఒకసారి ఓటమి చవిచూశాక గెలిచిన దాఖలాలు లేవని ఏ విధంగా చూసినా వికారాబాద్లో మళ్లీ ఎమ్మెల్యే ఆనంద్ విజయం సాధించడం ఖాయమని పేర్కొన్నారు.



