అభివృద్ధి ప్రదాతకే మా మద్దతు 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 16: ప్రజల కష్టసుఖాల్లో వెన్నంటి నిలుస్తూ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న పటాన్ చెరు అభివృద్ధి ప్రధాత, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి పటాన్ చెరు పట్టణంలోని చైతన్య కాలనీ, అంబేద్కర్ యువజన సేవా సమితి సభ్యులు ఏకగ్రీవ మద్దతు ప్రకటించారు.
గురువారం కాలనీలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే జిఎంఆర్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. పది సంవత్సరాలుగా ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకొని ప్రతిపక్ష పార్టీలు నేడు అభివృద్ధి చేస్తామంటూ ప్రచారాలు చేయడం సిగ్గుచేటు అన్నారు.అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న టిఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ కార్పొరేటర్లు శంకర్ యాదవ్, సపాన దేవ్, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కోమర గూడెం వెంకటేష్, శ్రీ రాములు, పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *