మహేశ్వరం, ప్రజాతంత్ర అక్టోబర్ 12: ప్రజలకు ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని అనేకం హామీలను నెరవేర్చడం జరిగిందని, ఒక సారి నేను చేసిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి కోరారు. బుధవారం మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 31వ డివిజన్ బాలాజీ నగర్ లో కాలనీ వాసుల ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మహేశ్వరం నియోజకవర్గానికి బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ కి నేను చేసిన సేవలు వెలకట్టలేనివని, గత ఎన్నికలలో ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని అనేక హామీలను నెరవేర్చినట్లు చెప్పారు. భవిష్యత్తు తరాలు గుర్తుంచుకునేలా నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. బడంగ్ పేట్ కేంద్రంలో నూతన మున్సిపల్ కార్యాలయం, ప్రజా భవన్, క్రీడా మైదానం, జిల్లా కేంద్ర గ్రంథాలయ భవనంతో పాటు మోడల్ పాటశాల భవనం, సమీకృత మార్కెట్ నిర్మించినట్లు గుర్తు చేశారు. ఇవే కాకుండా వందల కోట్లతో ప్రధాన రోడ్లతో పాటు కాలనీల రోడ్ల నిర్మాణం చేనట్లు చెప్పారు. గతంలో జరిగిన అభివృద్ధిని, ఇప్పుడు జరిగిన అభివృద్ధిని ప్రజలు ఒకసారి చూడాలన్నారు. ఏ రాష్ట్రంలో లేనన్ని సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలుపరుస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. నియోజకవర్గం అభివృద్ధికి ఎంతో కృషి చేశానని, అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఆదరించాలని కోరారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు గెలిపించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు మహేశ్వరం నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరు బిఅర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి, అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములను కావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, కాంటెస్టడ్ కార్పొరేటర్ ఎల్చల మమత సుదర్శన్ రెడ్డి, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రవణ్ కుమార్ యాదవ్, ఎస్.శ్రీశైలం, ధర్మేందర్ శర్మ, శ్రీనివాస్, కాలనీ వాసులు భారీగా పాల్గొన్నారు.
అభివృద్ధి చేశా ఆదరించండి -మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి



