అభివృద్ధి చేశాం.. ఓట్లు అడుగుతున్నాం            

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 13 : ఆమనగల్లు అభివృద్ధికి తన శక్తి మేరకు కృషి చేశానని మరో అవకాశం ఇస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని కల్వకుర్తి బిఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ అన్నారు. సోమవారం ఆమనగల్లు మున్సిపాలిటీలోని గుర్రం గుట్ట,  సాయి నగర్, ఆదర్శనగర్ కాలనీలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కేసీఆర్ భరోసా పథకాలను వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తనకు మరో అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ఇప్పటికే ఆమనగల్లులో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు, గ్రంథాల నూతన భవన నిర్మాణం, ప్రభుత్వ జూనియర్ కళాశాల, భవన నిర్మాణం చేపట్టడం జరిగిందని డిగ్రీ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజ్ మంజూరు అయ్యా అన్నారు. తనకు ఓట్లు వేసి గెలిపిస్తే ఆమనగల్ ను మరింత అభివృద్ధి పరుస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *