అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సుధీర్ రెడ్డి

వనస్థలిపురం ప్రజాతంత్ర అక్టోబర్ 3 : హస్తినాపురం డివిజన్ పరిధిలోని గతంలో పలు కాలనీల యందు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు .దేవిరెడ్డి సుధీర్ రెడ్డి దాదాపు 5 కోట్ల 40 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు మంజూరు చేయించడం జరిగింది.దానిలో భాగంగా నేడు పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ఎల్.బి.నగర్  శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి  పాల్గొన్నారు.దానిలో బాగంగా పిండి పుల్లారెడ్డి కాలనీ నందు యూజీడి లైన్ల కోసం శంకుస్థాపన సుమారు 9 లక్షల రూపాయలు,సరస్వతి కాలనీ నందు యూ.జీ.డి.పైప్ లైన్ శంకుస్థాపన సుమారు 53 లక్షలు,అనుపమ నగర్ కాలనీ నందు యూ.జీ.డి.పైప్ లైన్  కొరకు శంకుస్థాపన అంచనా వ్యయం సుమారు 42 లక్షలు,గోకుల్ ఎంక్లేవ్ నందు యూ.జి.డి.పైపులైన్ల కొరకు శంకుస్థాపన.అంచనా వ్యయం సుమారు 18 లక్షల 55 వేలు,షిరిడి సాయినగర్ నందు యూజీడి పైపు లైన్ల కోసం శంకుస్థాపన అంచనా వ్యయం సుమారు 12 లక్షల రూపాయలు,ద్వారకానగర్ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన అంచనా వ్యయం సుమారు 48 లక్షల రూపాయలు,హుడా భారతి కాలనీ నందు యూ.జీ.డి పైపులైన్ల కోసం శంకుస్థాపన అంచనా వ్యయం సుమారు 26 లక్షలు,ఇంద్రసేనారెడ్డి నగర్ నందు కమ్యూనిటీ హాల్  శంకుస్థాపన,హనుమాన్ నగర్ నందు సి.సి.రోడ్డు మరియు యూ.జీ.డి.పైపు లైన్ల కొరకు శంకుస్థాపన.అంచనా వ్యయం. ఒక్క కోటి 40 లక్షలు,భూపేష్ గుప్తా నగర్ నందు గ్రేవ్ యార్డ్ కొరకు శంకుస్థాపన అంచనా వ్యయం సుమారు 47 లక్షల 50 వేలు రూపాయలు,సాయి ప్రకాష్ కాలనీ నందు సి.సి.రోడ్డు పనులకు శంకుస్థాపన.అంచనా వ్యయం సుమారు 76 లక్షల రూపాయలు.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ నియోజకవర్గ అబివృద్దే తన లక్ష్యం అని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ప్రధాన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం చేయడం జరుగుతుందని అన్నారు.వేల కోట్ల రూపాయలతో ఇట్టి నియోజకవర్గన్నీ అభివృద్ధి చేసి ఒక రోల్ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయడం జరుగుతుందని అన్నారు.ఇట్టి కార్యక్రమంలో సీనియర్ నాయకులు గజ్జల మధుసూధనరెడ్డి,శ్రీనివాస్ నాయక్,డేరంగుల కృష్ణ,డివిజన్ అధ్యక్షులు ఆందోజు సత్యంచారి,వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయ్ రెడ్డి,కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం ధర్మకర్త శ్రీనివాస్ యాదవ్,మహిళా అధ్యక్షురాలు ఆదిలక్ష్మి,శివారెడ్డి,నాగిరెడ్డి,అనిత,పల్లం శ్రీనివాస్ మరియు డివిజన్ పరిధిలోని పార్టీ సీనియర్ నాయకులు,ఉద్యమకారులు,పలు విభాగాల కమిటీ సభ్యులు,మహిళలు,కార్యకర్తలు,పార్టీ అభిమానులు,వివిధ కాలనీ అధ్యక్ష,కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *