అభివృద్ధిని ఆశీర్వదించండి

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 20:  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం 10 సంవత్సరకాలంలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేసి, నిండు మనసుతో బి ఆర్ ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.శుక్రవారం పటాన్ చెరు పట్టణంలోని కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సతి సమేతంగా పూజలు నిర్వహించిన అనంతరం ప్రచార కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఇంటింటికి తిరుగుతూ, పార్టీ మేనిఫెస్టోను వివరిస్తూ, ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ. నియోజకవర్గ కేంద్రమైన పటాన్ చెరు పట్టణం గత ప్రభుత్వాల హాయంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురై మౌలిక వసతుల కల్పనలో వెనుకబడి ఉండేదని తెలిపారు.
పదేళ్ల కాలంలో పటాన్ చెరు పట్టణ రూపురేఖలు మార్చడంతో పాటు అభివృద్ధిలో ప్రతీకగా నిలిపామని తెలిపారు.ప్రతి గల్లీలో సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, వీధి దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు అన్ని వర్గాలకు ఫంక్షన్ హాళ్లు, పార్కులు, కేజీ నుండి పీజీ వరకు ప్రభుత్వ ఉచిత విద్య, మహనీయుల విగ్రహాలు, ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందించడంతోపాటు అర్హులైన ప్రతి ఒక్కరికి వివిధ సంక్షేమ పథకాలు అమలు చేశామని తెలిపారు.  దీంతోపాటు నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేయాలన్న సమన్న తలెక్షన్తో అర్హులైన వారందరికీ డబ్బులు బెడ్ రూమ్ ఇళ్లను అందిస్తున్నామని తెలిపారు.కొనసాగుతున్న అభివృద్ధి సంక్షేమం మరింత ముందుకు వెళ్లాలంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీకి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో .పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయకుమార్, పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, గూడెం కల్పన మధుసూదన్ రెడ్డి, కంకర సీను, వెంకటేష్, గుండమల్ల రాజు, నవీన్ రెడ్డి, మంగలి వినోద్, మాధవి, కొండల్, ధనరాజ్ గౌడ్, శ్యామ్, అరుంధతి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *