పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పరుగులు పెడుతుందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.గుమ్మడిదల మండల పరిధిలోని రామిరెడ్డి బావి, కానుకుంట, మంబాపూర్, గుమ్మడిదల దోమడుగు, మండల కేంద్రమైన జిన్నారం గ్రామాలలో కోటి 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన సిసి రోడ్లు, మహిళా భవనం, మత్స్యకార భవనాలను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాలలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని.. అనుక్షణం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వానికి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలోని మొట్టమొదటిసారిగా నిరుపేదల వివాహాల కోసం కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, రైతుబంధు, రైతు బీమా , దలీత బంధు, బీసీ బందు, మైనార్టీ బందు, గృహలక్ష్మి పథకాలను ప్రవేశపెట్టి సంక్షేమ రంగంలో విప్లవత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని అన్నారు.అన్నారం గ్రామంలో ముదిరాజ్ కులస్తుల విజ్ఞప్తి మేరకు రెండు రోజుల్లో ముదిరాజ్ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు.ఎమ్మెల్యే జిఎంఆర్ పర్యటన పరిష్కరించుకొని ఆయా గ్రామాల్లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి, ఎంపీపీ ప్రవీణ విజయ భాస్కర్ రెడ్డి, జెడ్పిటిసి కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ మండల అధ్యక్షులు షేక్ హుస్సేన్, రాజేష్, నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
అభివృద్ధికే పట్టం కట్టండి




