అభివృద్ధికి కేరాఫ్  బిఅర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరిన బండారి లక్ష్మారెడ్డి

  ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 20:   అభివృద్ధికి కేరాఫ్ బి ఆర్ ఎస్ పార్టీ అని, కారు గుర్తుకు ఓటు వేసి ఉప్పల్లో బిఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో వేగం పెంచారు. ప్రతిపక్షాల అంచనాలకు సైతం అందకుండా రెండవ దఫా ప్రచారంలో టాప్ స్పీడ్ లో దూసుకుపోతున్నారు. నాచారం డివిజన్ లో బిఆర్ఎస్ గ్రేటర్ సీనియర్ నాయకులు సాయి జెన్ శేఖర్  ఆధ్వర్యంలో బండారి లక్ష్మారెడ్డి హెచ్ఎంటి నగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో  ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాలనీలో పాదయాత్ర నిర్వహించి ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు  ఓటేసి తనను అధిక మెజార్టీతో గెలిపించాలని  అభ్యర్థించారు. ఈ సందర్భంగా తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజలకు స్పష్టంగా వివరించారు. గతంలో కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ఎలా ఉండేదో, తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో ఎంత అభివృద్ధి జరిగిందో ఒక్కసారి ఆలోచించి వోటు వేయాలని కోరారు. అభివృద్ది చేసిన బిఅర్ఎస్ పార్టీకే పట్టం కట్టాలని, కేసీఆర్ ని మూడవసారి ముఖ్యమంత్రిని చెయ్యాలని, ఉప్పల్ నియోజకవర్గంలో కారు గుర్తుకు ఓటేసి తనని భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్ధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *