పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1: కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా దూసుకెళ్తున్న పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మరోమాను తన గొప్ప మనసును చాటుకున్నారు.శుక్రవారం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.యాదవ సంఘం నిర్మాణానికి 30 లక్షలు, కురుమ సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న బీరప్ప గుడికి 30 లక్షలు, విద్యుత్ నగర్ హనుమాన్ గుడికి ఐదు లక్షల రూపాయలు, ఇందిరానగర్ లో చర్చి అభివృద్ధికి ఐదు లక్షల రూపాయల జి వి ఆర్ ఎంటర్ప్రైజెస్ తరపున భూరి విరాళాలను అందించారు.అనంతరం 90 లక్షల రూపాయలతో నిర్మించిన హుడా పార్కును ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ..సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. కులం మతం ప్రాంతం తేడా లేకుండా అన్ని వర్గాల ఆర్థిక అభ్యున్నతికి ఎల్లవేళలా తోడ్పాటు అందిస్తున్నామని తెలిపారు.ప్రజల ఆశీస్సులతో శరవేగంగా అభివృద్ధి చేపడుతున్నామని తెలిపారు. భవిష్యత్తులోనూ మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవల మున్సిపాలిటీలకు ప్రకటించిన 25 కోట్ల రూపాయల నిధులకు సంబంధించిన ప్రోసీడింగ్స్ విడుదల అయ్యాయని తెలిపారు.ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ లలితా సోమిరెడ్డి, వైస్ చైర్మన్ రాములు గౌడ్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, ఆయా వార్డుల కౌన్సిలర్ల, కో ఆప్షన్ సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు దేవేందర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.




