పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 26: అయోధ్య రామాలయం శంకుస్థాపన సమయంలో వాడిన అక్షింతలు బండలగూడ గ్రామానికి వచ్చాయని,
అయోధ్యలో శ్రీరామ ఆలయం జనవరి నెల 22న. ప్రారంభమవుతున్న సందర్భంగా శ్రీరాముని అక్షింతలు బండల గూడ గ్రామానికి చేరాయి. ఈ అక్షింతలను బండల గుడ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అభయ ఆంజనేయ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జనవరి నెల మొదటి, రెండు వారాల్లో ఈ అక్షింతలు ప్రతి ఇంటికి చేరవేస్తామని, అత్తి పవిత్రమైన ఈ అక్షింతలను తమ ఇళ్లలో పూజ గదిలో కానీ బీరువాల్లో కానీ పెట్టుకుంటే మంచిదని, ప్రతి ఒక్కరు స్వీకరిస్తారని అతి పవిత్రమైన ఈ అక్షింతలను ఇంట్లో ఉంచుకొని సుఖశాంతులు అష్టైశ్వర్యాలతో ఉండాలనీ అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నిర్వాహకులు, భాను ప్రకాష్, బిజెపి అధ్యక్షురాలు రజిని, నాగమల్లేష్ యాదవ్, శేఖర్, పూజారి నెహ్రూ, శ్రీశైలం, జంగులు, మాజీ వార్డ్ మెంబర్ శ్రీకాంత్, రాజు విజయలక్ష్మి దంపతులు, వినయ్ కుమార్, మౌనిక, శీను కవిత, కిషోర్ లావణ్య, గోపాల్, శ్రీనివాస్, వీరబోయిన శ్రీశైలం, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.




