అ‌ప్రజాస్వామిక చట్టాలను మారుస్తారా ..?

రాహుల్‌ ‌గాంధీగారికి రెండు రాష్ట్రాల తరపున మానవ హక్కుల వేదిక బహిరంగ లేఖ
‘‘మానవ హక్కుల వేదిక’’ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర కమిటీలు ‘భారత్‌ ‌జోడో యాత్ర’ కార్యక్రమంలో ఉన్న రాహుల్‌ ‌గాంధీకి ఒక బహిరంగ లేఖ ఆదివారం మీడియా కు విడుదల చేసారు. దేశ ప్రజలకు ఐక్యతే కాదు, ప్రజాస్వామ్యమూ అవసరం అని చెప్తూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మతం, మత విశ్వాసాల పేరుతో ప్రజల మధ్య విద్వేషం, విభజనలు పెంచుతూ ప్రజాస్వామ్య సంస్క•తికి వినాశనం కలిగిస్తున్న ఈ తరుణంలో రాహుల్‌ ‌గాంధీచేపట్టిన యాత్ర ఆహ్వానించదగినదనే అభిప్రాయం వేదిక వ్యక్తపరిచింది. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు మైనార్టీ మతస్తులకే ప్రమాకరం కాదని, ప్రజాస్వామిక దేశం అయిన భారతదేశంలో అన్ని ఆర్థిక, సామాజిక రాజకీయ వర్గాలకు ఊపిరి ఆడని పరిస్థితిని కల్పించిందని ఈ పరిస్థితిని మార్చాలని, మార్చే రాజకీయ వ్యవస్థ ఎదిగి బలోపేతంకావాలని తమ సంస్థ భావిస్తుందని లేఖలో పేర్కొన్నారు.

అయితే నిరుద్యోగ సమస్య, ధరల పెరుగుదల, కొద్ది మంది కార్పొరేట్‌ ‌సంస్థల్లో సంపద పోగవుతుందని, ఈ పరిస్థితి గతంలో పాలించిన కాంగ్రెస్‌ ‌హయంలో ప్రారంభం, అయి ఇప్పుడు వేగవంతం అయిందని దీని అర్థం చేసుకొని, ఈ పద్దతులను మార్చే ప్రయత్నం చేసి, సామాన్య ప్రజలకు అనుకూలమైన విధానాలు ప్రవేశపెడతారా అని వేదిక ప్రశ్నించింది. ప్రస్తుతం దేశంలో అమలు అవుతున్న నిర్భంధం, హక్కుల హననం, అణచివేత తీవ్ర స్థాయిలో ఉందని వివరణ ఇస్తూ, ఇప్పుడు అమలులో ఉన్న అప్రజాస్వామిక చట్టాలన్నిటిని రూపకల్పన చేసింది గతంలో కాంగ్రెస్‌ ‌పార్టీనే కదా అని ప్రశ్నిస్తూ – ఆ చట్టాలను ఇంకా బలోపేతం చేసుకొని బీజేపీ స్వార్ధ పద్దతుల్లో పాలన కొనసాగిస్తుంది. ఈ చట్టాలను వ్యతిరేకించి వాటి రద్దుకు కృషి చేస్తానని యాత్రలో ప్రకటన చేయాలని కోరింది.

ఇదే అంశంలో వివరణ ఇస్తూ మీరు పాదయాత్ర చేస్తున్నారు కాని, చత్తీస్‌ఘడ్‌, ‌సుక్మా జిల్లాలో పోలీసు క్యాంపులు ఎత్తివేయాలని ప్రజలు సంవత్సరాల కాలంగా ధర్నా చేస్తున్నారు. వారి శిబిరంపై కాల్పులు జరిపి అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ‌పార్టీ ఐదుగురి మరణానికి కారణమైంది. సిల్గూర్‌ ‌నుంచి నిరసన యాత్ర చేయడానికి, సి.ఎ.ఐ నాయకత్వంలో ప్రయత్నిస్తే అనుమతి లేదని, అడ్డుకున్నారన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాం అని బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ఈ బహిరంగ లేఖను ఈ రోజు (29-10-2022)న రెండు రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు ఎస్‌. ‌జీవన్‌కుమార్‌ ‌విడుదల చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *