- మార్పు కోసమే హాత్ సే హాత్ జోడో
- ప్రజలపై రూ. 5 లక్షల కోట్ల భారం
- రాష్ట్రంలో మళ్ళీ విద్యుత్ సంక్షోభం
- ఏ గట్టున ఉంటారో కమ్యూనిష్టులే తేల్చుకోవాలి
- కామేపల్లి మండలం హాత్ సే హాత్ జోడో యాత్ర లో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి
ఇల్లందు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : పదేళ్ళ సిఎం కెసిఆర్ పాలనలో తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని, ప్రజలపై రూ 5లక్షల కోట్ల ఆర్థిక భారాన్ని మొపాడని, యావత్ రాష్ట్ర ప్రజలు కేసిఆర్‌ను మట్టికరిపించేందకు సిద్దపడ్డారని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. మళ్ళీ 20 ఏళ్ళకు ప్రజలు విద్యుత్ సంక్షోభం ఎదుర్కున బోతున్నారని తెలంగాణలో మార్పు కోసమే హాత్ సే హాత్ జోడో యాత్రను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. రైతులకు 24 గంటలు విద్యుత్ అంటూ బిఆర్‌ఎస్ నేతలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఊదరకొడుతున్నారని..కానీ వాస్తవానికి ఏ ఒక్క రైతుల పొలాలలోని ఏ ఒక్క మీటర్‌కు విద్యుత్ అందడం లేదని ఎద్దేవ చేశారు. హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రలో భాగంగా ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గం కామేపల్లి మండలం కొత్తలింగాలలో శుక్రవారం టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గడచిన పదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వవం 5 లక్షల కోట్లు అప్పులు తెచ్చిందని, ఈ లెక్క ప్రకారం ఒక్కొక్క నియోజకవర్గానికి కనీసం రూ 20 వేల కోట్లు రావాలి కానీ వచ్చాయా అని ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ అని చేప్పి నేటికీ అమలుకు నోచుకోలేదన్నారు. దీనితో కర్షకులు భూములు కోల్పోయే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టింది, దాని నీరుగారిచే ప్రయత్నం జరుగుతుందన్నారు. నేటికీ రూ 5 వేల కోట్ల ఫీజు బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు. రూ 8 వేల కోట్లు ఆరోగ్యశ్రీ పథకానికి బకాయి పడ్డారని, ప్రభుత్వ వ్యవహార శైలి చూస్తే ఆరోగ్య శ్రీ పథకాన్ని సైతం అటకెక్కించేలా ఉందన్నారు. 2003 కంటే ముందు ఏ విధమైన విద్యుత్ కోతలు మళ్లీ విద్యుత్ సంక్షోభం రాష్ట్రం ఎదుర్కోబోతోందని ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతులకు ఉచిత విద్యత్ అందించారని గుర్తు చేశారు. ప్రస్తుతం 24 గంటల విద్యుత్ అంటున్నారు తప్ప ఏ మోటర్లకి కరెంటు అందటంలేదని ఎద్దేవ చేశారు. ప్రైవేటు విద్యుత్ సంస్థల నుండి రూ 14 నుండి 15వరకు విద్యుత్ కొనుగోలు చేసి అందులో 50శాతం కమిషన్ ద్వారా లబ్ధి పొందుతున్నారని ఆగ్రహించారు.
మళ్ళీ 20 ఏళ్ళకు విద్యుత్ సంక్షోభం
2014 నుండి నేటివారకు ఎన్నికల ప్రణాళికలో భాగంగా 24 గంటల ఉచిత విద్యుత్ అని చెప్పేసి చెప్తున్నారు. రూ 20వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మొండి బకాయిగా రూ 60 వేల కోట్లు అప్పుగా మారిందని తెలిపారు. ప్రభుత్వ తీరుతో విద్యుత్ సంస్థల వ్యవస్థలు దివాలా తీస్తున్నాయని మండిపడ్డారు. ఏ బ్యాంకు ఈ సంస్థలకు రుణాలు ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం సరైన విధానాలను అనుసరించక పోడంతో విద్యుత్ సంస్థలు రూ 60 వేల కోట్ల అప్పుల్లో కూరుకు పోయాయని చెప్పారు. కెసిఆర్ ధన దాహంతో రూ వేలకోట్లు కొల్లగొట్టాలని విద్యుత్ వ్యాపారం చేస్తున్నారని కామెంట్ చేశారు. రూ 2.25 కే కేంద్ర విద్యుత్ సంస్థలు విద్యుత్ ఇస్తుంటే కేవలం కమిషన్‌లకు కక్కుర్తిపడి ప్రభుత్వ రంగ సంస్థల దగ్గర విద్యుత్తు కొనుగోలు చేయకపోవడంతో రూ వేల కోట్లు విద్యుత్ సంస్థలకు బకాయి పడిందన్నారు. ఆంధప్రదేశ్ ప్రభుత్వం నుండి కూడా విద్యుత్ కొనుగోలు చేసే అవకాశం ఉన్న కమిషన్లు రావనే ఉద్దేశంతో జీవీకేలు, జిఎంఆర్‌లు, మై హోమ్‌లో తను నమ్మిన బంట్ల దగ్గర కొనుగోలు చేసి వాళ్లకు రూ వేలకోట్లు కట్టబట్టి లాన్కోలను సంస్థలని కొనుగోలు చేశారని దుయ్యబట్టారు.
చత్తీస్‌ఘడ్ నుంచి వేయ్యి మెగా వాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో లాభపడేందుకు భదాద్రి కొత్తగూడెం విద్యుత్ పవర్ ప్రాజెక్ట్ లనులను సకాలంలో పూర్తి చేయకపోడంతో రూ 30 వేల కోట్లది కాస్తా వెయ్యి కోట్లకు పెరిగిందన్నారు. గుజరాత్ కంపెనీతో రూ 10 వేల కోట్ల డీల్ కుదిరించుకొని తుప్పు పట్టిన టెక్నాలజీని అంటగట్టారని వెల్లడించారు. యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ 4 వేల మెగావాట్లు రూ 35 వేల కోట్లు బ్యాంకు రుణం తీసుకుందని, టెండర్ ఇవ్వకుండా బిహెచ్‌ఇఎల్‌కి నామినేట్ పద్ధతిలో ఇచ్చిందని అందుకు ప్రతిఫలంగా బిఎస్సి నుండి సివిల్ వర్క్ సొంత మనుషులకు కాంట్రాక్టర్లకు ఇచ్చి రూ వేలకోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. జార్ఖండ్ ప్రభుత్వం 4 మెగావాట్లకు ఉత్పత్తికి రూ 35 వేల కోట్ల టెండర్లు బిహెచ్‌ఇఎల్‌కి కట్టబెట్టింది అయితే మళ్లీ బిఎస్‌ఎన్‌ఎల్ నుంచి కాంట్రాక్టు పద్ధతిలో సొంత వారికి తిరిగి అప్పగించి బిఎస్‌ఎల్ నుంచి వేల కోట్ల రూపాయలు వెనక్కి ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చారు చర్చ జరగాలని డిమాండ్ చేశారు. న్గండ జిల్లాలో యాదాద్రి పవర్ ప్రాజెక్టు మొదలై నేటికీ పూర్తి కాలేదని గుర్తు చేవారు. ఉమ్మడి రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ నుండి జంతువులకు నియమించాల్సిన వారిని పోయి సొంత మనిషిని ప్రభాకర్‌కి కట్టబెట్టడం విడ్డూరంగా ఉందన్నారు.
పదవీ విరమణ పొందిన వ్యక్తిని పట్టుకొచ్చి ట్రాన్స్కోకు సిఎండిగా నియమించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజలు అప్రకటిత విద్యుత్ కోతలను ఎదుర్కొంటున్నాని, 2014 నుండి నేటివరకు విద్యుత్ కొనుగోలుపై తక్షణమే విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. రూ 45 వేల కోట్లు జెన్కోపై అప్పులు మోపినందుకు విచారణ జరగాలని, రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి రూ 20 వేల కోట్లు బకాయి పడిందని వాటిని తక్షణమే చెల్లించాలన్నారు. ఎసిడి చార్జీలతో రూ 20 వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపుతున్నారని, ఎవరూ ఈ చార్జీలు చెల్లించవద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టగానే వీటిని రద్దు చేస్తుందని హామీ ఇచ్చారు.
కమ్యూనిష్టులు ఎవరి పక్షమో తేల్యుకోవాలి
ఈఆర్సీపీ కచ్చితంగా విడుదల చేయాల్సిందే అని, త్వరలో సరైన నిర్ణయం తీసుకోకపోతే కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యుత్ సౌద ముట్టడి ఈఆర్పిల ముట్టడిచేస్తామని, రోడ్లపై నిరసనలు చేపడుతామని హెచ్చరించారు. వచ్చే కొత్త ఏడాదిలో కొత్త ప్రభుత్వాన్ని కాంగ్రెస్ చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక 9 నెల గడవు మిగిలి ఉందని, అన్ని రకాల విచారణలు అధికారులు ఎదుర్కోవాల్సి వస్తదన్నారు. అప్పుల్లో కూరుకుపోడానికి నలుగురు కారణమని, దీని వెనక సిఎం కెసిఆర్ దోపిడీదారుడు అయితే కెటిఆర్, కవిత, హరీష్ రావులు లబ్ధిదారులని ఎద్దేవ చేశారు. కమ్యూనిస్టులకు ఒకటే చెబుతున్నా మీరు దోపిడీదారుల పక్షాన ఉంటారా ప్రజల ఆశిర్వాదం ఉన్న కాంగ్రెస్ పక్షాన ఉంటారో తేల్చుకోవాలని హితవు పలికారు.
నాటి విద్యుత్తు ఉద్యమం ఉవెత్తున ఎగసిపడటానికి కారణమైన కమ్యూనిస్టులు ఎందరో తమ ప్రాణాలను బలిదానం చేసరని గుర్తుచేవారు. మిత్రులు ఎర్రజెండా నాయకులు పేదలకు అండగ నిలబడ్డ కమ్యూనిష్టులు నేడు సంక్షేభంలో దోపిడీ పాలనతో రాష్ట్రం సంక్షోభంలో ఉందని అలాంటప్పుడు ఈ ప్రభుత్వ పక్షాన ఎందుకు నిలబడుతున్నారని ప్రశ్నించారు. ప్రజల పక్షాన పోరాడుతున్న తమతో కమ్యూనిష్టులు కలిసి రావాలని వీరభద్రం, సాంబశివును కోరారు.
ఆస్తుల మీద విచారణ జరపాలి
మంత్రి కెటిఆర్, రేవంత్ రెడ్డి ఆస్తుల మీద హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని లేఖ రాస్తానని మీరు సిద్ధమా అని సవాలు విసిరారు. పారదర్శకమైన పరిపాలన అందిస్తున్నప్పుడు సమాచారం ఇవ్వడానికి మీకు భయమెందుకు అని ప్రశ్నించారు. మంత్రి కెటిఆర్ శాఖలో 111 జీవో పరిధిలో ఉన్న నాగులపల్లి గ్రామంలో హైకోర్టు నుండి వెయ్యి ఎకరాలకు మినహాయింపు తీసుకొచ్చారని, అందులో మీరు సమర్పించిన నివేదికలు, ప్రస్తావించిన జవహరి కమిటీ రిపోర్ట్ అన్ని బూటకమని, తప్పుడు వివరాలతో కోర్టును తప్పుదోవ పట్టించి సుమారు రూ వేల కోట్లు దోచుకున్నారని విమర్శించారు.ఈ కుంభకోణం వెనుక ఉన్న రాజులు రావులు ఎవరో తేలాలని, ఈ కుంభకోణం లో జరిగిన లావాదేవులపై పూర్తి విచారణ సిట్టింగ్ జడ్జితో జరిపించాలని డిమాండ్ చేశారు.
ఐఏఎస్ అధికారి అరవిందు కుమార్ ఎలా విచారణ జరిపారో కూడా బయట పెట్టాలన్నారు. నీతిమంతులు అయితే ఇద్దరిపై విచారణ కోరుదామని, కోర్టు ముందు హాజరయ్యేందుకు సిద్ధమని, సిట్టింగ్ జడ్జి విచారణ ఎదురుకోవడానికి వట్టినాగులు వెయ్యి ఎకరాల భూమిపై, తెల్లాపూర్ వైపు, మియాపూర్ 500 ఎకరాల భూములలో ఎంపీ వందల కోట్ల రూపాయల అక్రమాలపై ఆరోపణలు సంధించారు. ధరణి పొర్టల్‌తో భూ కుంభకోణాలకి పాల్పడ్డారని, ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతులకు వెళ్ళాయని, ధరణి పోర్టల్ ద్వారా మన భూముల వివరాలు దేశాలకు వెళ్లిపోయాయని ఆరోపించారు.
ఇల్లందు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట
మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం లో ఇల్లందు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అన్నారు. బట్టి విక్రమార్క శాసనసభ సమావేశాలు జరుగుతున్నందున రాలేకపోయారని, వారి ఆదేశాల మేరకు జిల్లా నాయకత్వం ప్గాంటుందన్నారని స్పష్టం చేశారు. రామ్ రెడ్డి వెంకట్ రెడ్డి ఈ ప్రాంతంలో ప్రజలకు ఎన్నో సేవలు చేశారని, తుదిశ్వాస వరకు పార్టీ కోసం పనిచేశారని తెలిపారు. ఇల్లందు నియోజకవర్గంలో పార్టీ గెలుపు కోసం ఎంతో కఅషి చేశారని గుర్తు చేశారు. ఈ యాత్ర తెలంగాణ ప్రజల జీవితాలలో మార్పు తీసుకురావాలని కోరుకుతున్నానని రేవంత్ రెడ్డి తెలిపారు. ముందుగా ఖమ్మం జిల్లా నాయకులు అందరూ ఆయనకు ఘన స్వాగతం పలికారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర నియోజకవర్గంలో ఉదయం లచ్చ్చా తండానుండి ప్రారంభమై బర్లగూడెం, పొన్నెకళ్ళు వరకు పాదయాత్ర కొనసాగింది. భోజన విరామం తరువాత బండిపాడు క్రాస్ రోడ్డు, గోవిందరాల, కొత్త లింగాల వరకు సాగింది.



