అన్ని స్థానాల నుంచి ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ పోటీ

•పార్టీ మైనారిటీ విభాగం జాతీయ అధ్యక్షుడు బిషప్ దాసన్న
ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15 : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల నుంచి పోటీ చేయనున్నట్లు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం జాతీయ అధ్యక్షుడు బిషప్ దాసన్న వెల్లడించారు. ఆదివారం జరిగిన పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశంలో నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ కన్వీనర్ సీయెచ్ బాలకృష్ణ, పార్టీ జాతీయ అధ్యక్షుడు కేబీ శ్రీధర్ తో కలిసి మాట్లాడారు. రెండు రోజుల్లో పార్టీ తొలి జాబితా విడుదల చేస్తామని చెప్పారు. కులమతాలతో సంబంధం లేకుండా అన్నీ వర్గాలకు ముఖ్యంగా యువత, మహిళల కు అధిక ప్రాధాన్యత ఇస్తామని వివరించారు. పార్టీ ఆధ్వర్యంలో సభలు నిర్వహించి విస్తృతంగా ప్రచారం చేస్తామని వివరించారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, మాదక ద్రవ్యాలు యువత జీవితాలను నాశనం చేస్తున్నాయని తెలిపారు. మాతృ ప్రేమతో పరిపాలన సాగించాలనే నినాదంతో తమ పార్టీ ముందుకు వెళ్తుందని వెల్లడించారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు ఉదయలక్ష్మి, మోహన్ గాంధీ, బాషా, దశరధం, వాసుదేవరావు, నవీన్, శివకుమార్ యాదవ్ తదతరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *