అన్ని వర్గాలకు అండగా టీఆర్ఎస్ పార్టీ నిలుస్తుంది దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 20:  వర్గాల ప్రజలకు అండగా, తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన ముందుకు పోతుందని దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎల్.బి.నగర్ భారాస పార్టీ అభ్యర్థి, శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సోమవారం నాగోల్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ గుడిసెల నందు గల్లీ, గల్లీ తిరుగుతూ పాదయాత్ర చేయడం జరిగింది. ఈ సందర్భంగా బస్తీవాసులు సుధీర్ రెడ్డికి బ్రహ్మారథం పట్టారు. సుధీర్ రెడ్డి వారు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపించుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం సుధీర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని ప్రధాన సమస్యలు పరిష్కారం చేయడం జరిగిందని తెలిపారు. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని దశలవారీగా పరిష్కారం చేస్తామని తెలిపారు. మరింత అభివృద్ధి కావాలంటే వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి నియోజకవర్గ అభివృద్ధికి మీ యొక్క సహాయ, సహకారాలు అందించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *