తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్,16: అన్ని దానాలలో కెల్లా అన్నదానం మహా గొప్పదని తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్ అన్నారు. బుధవారం అమావాస్య సందర్భంగా పట్టణంలోని పాత కుంట ఆదర్శనగర్ లో వెలసిన శ్రీ కట్ట మైసమ్మ ను మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్ దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అల్లంపల్లి ప్రకాష్ కుమ్మరి నర్సింలు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్ మాట్లాడుతూ ప్రతి అమావాస్య సందర్భంగా ఆలయంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. శ్రీ కట్ట మైసమ్మ భక్తులు కోరుకున్న కోరికలను తీర్చే మహా గొప్ప మహిమగల దేవతాన్ని అన్నారు. తాండూరు ప్రజలపై అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లంపల్లి ప్రకాష్ కుమ్మరి నర్సింలు న్యాయవాది దిలీప్ సింగ్ ఠాకూర్ మోహన్ దశరథ్ తదితరులు ఉన్నారు.




