అనుమానాస్పద స్థితిలో వివాహిత ఆత్మహత్య

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 24 : ఆమనగల్లు మున్సిపాలిటీ లోని ఆదర్శనగర్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న అలివేలు అనే వివాహిత మహిళ అనుమానాస్పద స్థితిలో ఇంట్లో ఉన్న ఫ్యాన్ కురేసుకొని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆమనగల్ పట్టణానికి చెందిన ప్రేమ్ కుమార్ గత ఆరు నెలల క్రితం వివాహిత మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న నాటి నుంచి శారీరకంగా మానసికంగా వేధించేవాడని భర్త వేధింపులు భరించలేక భార్య అలివేలు (38) ఫ్యాన్ కు ఉరేసుకొని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అలివేలు మృతి చెందిన విషయాన్ని ప్రేమ్ కుమార్ తన బామ్మర్ది కృష్ణకు సమాచారం ఇవ్వగా వచ్చి చూసి లేపే ఆమె ఆత్మహత్య చేసుకుని పడి ఉంది ఈ విషయమై కృష్ణ తన బావ ప్రేమ్ కుమార్ పై ఆమనగల్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త వేధింపుల తోటే భార్య మృతి చెందిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఆమనగల్ ఎస్సై బలరాం నాయక్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *