అనారోగ్యం వల్లే కేబినేట్‌కు దూరం

  • రాజీనామా వార్తలు సరికాదు
  • నేను ఎప్పుడూ ఏ పదవీ అడగలేదు
  • క్రమశిక్షణ గలిగిన కార్యకర్తగా పార్టీ ఆదేశాలను శిరసావహిస్తా
  • ప్రధాని వరంగల్‌ ‌సభ తరవాత పార్టీ పగ్గాలు
  • వి•డియాతో కేంద్ర మంత్రి కిషన్‌ ‌‌రెడ్డి
  • ప్రధాని పర్యటన ఏర్పాట్లకు గాను మూడు రోజులు వరంల్‌లోనే మకాం

న్యూ దిల్లీ, జూలై 5 : అనారోగ్యం వల్లే కేబినెట్‌ ‌భేటీకి దూరంగా ఉన్నానని, కేంద్రమంత్రి పదవికి తాను రాజీనామా చేయలేదని కిషన్‌రెడ్డి స్పష్టత ఇచ్చారు. అధిష్టానం ఏ ఆదేశాలిచ్చినా పాటిస్తానని, తనకు అధ్యక్ష పదవి ఇస్తారని అనుకోలేదని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయనున్నారని ప్రచారంపై ఆయన స్పందించారు. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడం లేదని స్పష్టం చేశారు. దిల్లీలో బుధవారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ..జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వంలో సమన్వయం చేసుకుంటూ వెళ్తామని, అధికారిక ప్రకటనలు నమ్మాలని వదంతులను నమ్మకూడదని సూచించారు. కేంద్రమంత్రిగా ఉన్న ఆయన కేబినెట్‌ ‌వి•టింగ్‌ ‌కు హాజరుకాకపోవడంతో పదవికి రాజీనామా చేయడం వల్లే గైర్హాజరు అయ్యారని ప్రచారం జరిగింది. అయితే కేంద్ర మంత్రివర్గ పునర్‌ ‌వ్యవస్థీకరణ వరకు తాను కేంద్ర మంత్రిగా కొనసాగుతానని క్లారిటీ ఇచ్చారు.

బుధవారం సాయంత్రం దిల్లీ నుంచి హైదరాబాద్‌కు వొచ్చాక రాష్ట్ర ముఖ్య నేతలతో భేటీ అయి పలు విషయాలపై చర్చించనున్నట్లు చెప్పారు. ఈరోజు వరకు తాను పార్టీని ఏదీ కావాలని కోరలేదని కిషన్‌ ‌రెడ్డి తెలిపారు. అయితే తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్ర బీజేపీ తొలి అధ్యక్షుడిగా చేసినట్లు గుర్తుచేశారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌లో సైతం 2 పర్యాయాలు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించానన్నారు. పార్టీ ఆదేశిస్తే, ఏ పని చేయడాని కైనా తాను సిద్ధమేనని పేర్కొన్నారు. వరంగల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ సభ విజయవంతం చేసేందుకు పార్టీ నేతలం ఫోకస్‌ ‌చేశామన్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా పార్టీ అధిష్టానం తనను నియమించాక తొలిసారి కిషన్‌ ‌రెడ్డి స్పందించారు. ప్రస్తుతానికి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయలేదన్న ఆయన, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తా అన్నారు.

జులై 8న వరంగల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ సభ ఉంటుందని, ఆ తర్వాత బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ నేపథ్యంలో రాత్రికి హైదరాబాద్‌కు వొచ్చిన తర్వాత రాష్ట్ర పార్టీ నేతలతో కీలకంగా భేటీ కానున్నారు. నేడు ఉదయం వరంగల్‌కు వెళ్లనున్నట్లు తెలిపారు. ఎనిమిదో తేదీ వరకు వరంగల్‌ ‌లోనే ఉండి సభ ఏర్పాట్లు, ప్రజా సవి•కరణ, నేతలతో ప్రస్తుత పరిస్థితులపై చర్చించి కేంద్రానికి వివరించనున్నారని తెలుస్తుంది. ఎంపీగా గెలిచాక హోమ్‌ ‌శాఖ సహాయ మంత్రిగా, ఆ తర్వాత రెండేళ్లు కేబినెట్‌ ‌మంత్రిగా పని చేశానని కిషన్‌ ‌రెడ్డి గుర్తుచేసుకున్నారు. తాను ఏనాడూ పార్టీని ఏదీ అడగలేదని, కోరలేదని, పార్టీ ఆదేశాలను పాటిస్తూ వొస్తున్నానన్నారు. 1980 నుంచి ఒక సైనికుడిలా పనిచేస్తూ వస్తున్నానన్నారు. వొచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో కృషి చేస్తానని, సమష్టి ప్రణాళిక తయారుచేసుకుని ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. మోదీ వరంగల్‌ ‌పర్యటనను విజయవంతం చేయడానికి పార్టీ నాయకత్వం మొత్తాన్ని ఏర్పాట్లలో సహకరించాలని కోరుతున్నానన్నారు. రైల్‌ ‌వ్యాగన్‌ ‌తయారీ కేంద్రంకు ప్రధాని భూమిపూజ చేస్తారని, 150 ఎకరాల స్థలంలో ఈ పరిశ్రమ రానుందన్నారు. రైల్వే ఓవర్‌ ‌హాలింగ్‌ ‌యూనిట్‌ అని తొలుత అనుకున్నామని, కానీ ప్రధాని వ్యాగన్‌ ‌యూనిట్‌ ‌పెట్టడానికి ఓకే చెప్పారన్నారు. వరంగల్‌ను రైల్వే తయారీ హబ్‌గా తయారు చేయబోతున్నామన్నారు.

తెలంగాణకు ఇంత పెద్ద వర్క్ ‌షాప్‌, ‌తయారీ యూనిట్‌ ‌రావడం ఇదే మొదటిసారని అన్నారు. అలాగే మోదీ నూతన జాతీయ రహదారులకు భూమిపూజ చేస్తారని, వరంగల్‌ ఎయిర్‌ ‌స్ట్రి ‌ద్వారా నేరుగా హెలికాప్టర్‌లో అక్కడికి వొచ్చి, భద్రకాళి దర్శనం చేసుకుంటారన్నారు. రైల్వే యూనిట్‌ను వర్చువల్‌ ‌విధానం ద్వారా ప్రారంభిస్తారన్నారు. ఆర్టస్ ‌కాలేజి గ్రౌండ్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని, ఈ కార్యక్రమాలు విజయవంతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అలాగే జూలై 9న దక్షిణ భారత రాష్ట్రాల బీజేపీ ముఖ్య నేతల సమావేశం హైదరాబాద్‌లో జరుగుతుందని కిషన్‌ ‌రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *