అనర్హులకు దళిత బంధు కేటాయిస్తూ పేద ఎస్సీలకు అన్యాయం చేస్తున్నారు.

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 28: ధనవంతులకు భూస్వాములకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు దళిత బంధు ఇస్తున్నారు తప్ప అర్హులైన పేద ఎస్సీలకు ఇవ్వడం లేదని గొట్టిముక్కుల గ్రామ ఎస్సీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ మండలం గొట్టిముక్కుల గ్రామంలో గతంలో ప్రభుత్వ భూములు పొందిన వారికి డబ్బులు ఉన్నవారికి ధనవంతులకు భూస్వాములకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు దళిత బంధు కేటాయిస్తున్నారని అర్హులకు దళిత బంధు కేటాయించాలని గ్రామపంచాయతీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గొట్టిముక్కుల గ్రామ దళితులు మాట్లాడుతూ ప్రభుత్వం పేద దళితుల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని అనర్హులకు కేటాయిస్తూ పథకాన్ని నీరు గారు ఇస్తున్నారని పేర్కొన్నారు. సరైన విధంగా విచారణ చేపట్టి అర్హులైన పేద ఎస్సీలకు దళిత బంధు కేటాయించి వారి అభివృద్ధికి తోడ్పాటున అందించాలని పేర్కొన్నారు. కేవలం ప్రజా ప్రతినిధులు చెబితే వినే వారికి నాయకులకు మాత్రమే దళిత బంధు కేటాయించి పేద ఎస్సీలకు మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా అధికారులు స్పందించి విచారణ చేపట్టి పేద ఎస్సీలకు దళిత బంధు కేటాయించి అభివృద్ధికి బాటలు వేయాలని వారు డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *