అధిష్టానం నిర్ణయమే ఫైనల్

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 28 : బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ నిర్ణయమని ఆయన నిర్ణయానికి కట్టుబడి ప్రతి బి ఆర్ ఎస్ కార్యకర్త పనిచేస్తామని కడ్తాల్ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్, బి ఆర్ ఎస్ కడ్తాల మండల అధ్యక్షుడు కంబాల పరమేష్ అన్నారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల115 అసెంబ్లీ నియోజకవర్గాలలో అభ్యర్థులను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని కొందరు నాయకులు పనిగట్టుకుని ఒక వర్గానికి సపోర్టింగ్ గా బిఆర్ఎస్ పార్టీకి, తీవ్ర నష్టాన్ని కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని, గ్రౌండ్ లెవల్ లో అనేక సర్వేలు, ఇంటెలిజెంట్ రిపోర్ట్స్ జరిపిన పిదపనే పార్టీ అధిష్టానం  అభ్యర్థులను ప్రకటించడం జరిగిందన్నారు. సామాజిక కోణంలో కూడా ఆలోచించి అధిష్టానం నిర్ణయం తీసుకోగా కెసిఆర్ గారిని మళ్ళి అభ్యర్థి విషయంలో పునరాలోచించాలి అని అనడం విడ్డూరంగా ఉందనీ వారన్నారు. తెలంగాణ  రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి పథకాలలో పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్  నిర్ణయాన్ని మార్చుకోమనడం వారి అవివేకానికి నిదర్శనమని అన్నారు. కేసీఆర్ నిర్ణయం పైన గౌరవం ఉంటే ఇకనైనా ఇలాంటి పనులు మానుకొని పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండి పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కల్వకుర్తి నియోజకవర్గంలో ఇటీవలి కాలంలో  నియోజకవర్గం లో ఉన్న ఆరు మండలాలలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి గౌరవ ముఖ్యమంత్రి అనేక సర్వేలు నిర్వహించే ప్రజల మద్దతు ఎవరికైతే ఎక్కువగా ఉందో వారినే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గా జైపాల్ యాదవ్ ను  మరొకసారి అవకాశం కల్పించడం జరిగిందన్నారు. కల్వకుర్తి నియోజకవర్గం లో వివిధ ఆత్మీయ సమ్మేళనంలో  ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్ కర్నూల్ జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్  వివిధ సభలలో  అధిష్టానం ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చిన కలిసి పని  చేస్తాం అన్ని చెప్పి  ఇప్పుడు మాట  మార్చడం ఏమిటని ప్రశ్నించారు. కెసిఆర్ నిర్ణయానికి అభ్యర్థి, బి ఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసిన , ఏ హోదాలో ఉన్న  పార్టీ జిల్లా అధ్యక్షుడుకి ఫిర్యాదు చేసి వారిని పార్టీ నుండి సస్పెండ్ చేయిస్తా మని కంబాల  పరమేష్  పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో కడ్తాల్ జడ్పిటిసి సభ్యులు దశరథ్  నాయక్, ఆమనగల్లు, కడ్తాల్, మండలాల  పిఎసిఎస్ చైర్మన్ గంప వెంకటేష్ గుప్త, సర్పంచుల సంఘం అధ్యక్షులు లక్ష్మీ నరసింహ రెడ్డి, కడ్తాల్ మండల్  రైతు  సమన్వయ సమితి అధ్యక్షులు జోగు వీరయ్య,  ఎంపీటీసీలు, లచ్చిరాం నాయక్, మంజుల చంద్రమౌళి, ప్రియా, రమేష్, గొప్పిడి గోపాల్,  కడ్తాల్ ఉప సర్పంచ్  కడారి  రామకృష్ణ, వార్డ్ సభ్యులు, రామచంద్రయ్య ఏ ఎం సి డైరెక్టర్ లాయక్ అలీ, కడ్తాల్ టౌన్ అధ్యక్షులు వెంకటేష్, సీనియర్ నాయకులు బాలకృష్ణ,  యాదయ్య, నరసింహ, శ్రీశైలం, నాయకులు అంజి, ఎర్ర రామకృష్ణ, మంకీ  శ్రీకాంత్, రాజశేఖర్, ప్రశాంత్, వేణు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *