పెద్దసారు త్వరగా కోలుకోవాలి
రాష్ట్రానికి కేసీఆర్ సేవలు చాలా అవసరం
బీఆర్ఎస్ యువజన,విద్యార్థి విభాగం నాయకులు
సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 9: సిద్దిపేట వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు రాష్ట్ర ప్రజల బాగు కోరే ప్రజా నాయకుడు మాజీ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని బీఆర్ఎస్ యువజన, విద్యార్థి నాయకులు ఆకాంక్షించారు. ఈ మేరకు శనివారం సిద్దిపేట వేంకటేశ్వర ఆయలంలో యువజన, విద్యార్థి విభాగం నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నేతగా కేసీఆర్ సేవలు ఈ రాష్ట్రానికి చాలా ఆవసరమన్నారు. దురదృష్టవశాత్తు ఆయన ఎడమ కాలి తుంటి ఎముక విరిగిందని, భగవంతుని దీవెనలు, ప్రజా ఆశీర్వాదం తో కేసీఆర్ త్వరగా కోలుకుంటారని ఆశీస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినప్పటికీ తెలంగాణ ప్రజలు కేసీఆర్ మీద ఉన్న నమ్మకంతో 39 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ప్రతిపక్ష హోదాలో పెద్ద బాధ్యతలు ఉంచారని, ప్రతిపక్ష హోదాలోనూ ప్రభుత్వానికి మంచి సూచనలు చేయాలన్నారు. త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకొని నిండు నూరేళ్లు బతకాలని ఆ భగవంతున్ని వేడుకున్నామన్నారు.ఈ కార్యక్రమంలో రంగధాంపల్లి శ్రీను,జువ్వన కనకరాజు,మెర్గు మహేష్,రజనీకాంత్ రెడ్డి,రెడ్డి ప్రభాకర్ రెడ్డి, మహీపాల్ గౌడ్,బెల్లంకొండ వెంకట్,దికొండ భాస్కర్ నేత,ఆకుబత్తిని రాము,అరవింద్ రెడ్డి,గుజ్జరాజు,సాయి గౌడ్,అంజిరెడ్డి, సిద్దు, తదితరులు పాల్గొన్నారు.





