అధికార పార్టీ అండతో..భూకాబ్జాలు

  • ప్రభుత్వ భూమి కనిపిస్తే ఖతం
  • బీనామి పేర్లతో బిందాస్‌ ‌దందా
  • పేదలకు దక్కాల్సిన భూములపై కన్నేసిన ప్రజాప్రతినిధి భర్త
  • నకిలీ ఇండ్ల పట్టాలను సృష్టించి అమాయాకులకు విక్రయాలు
  • నిమ్మకు నీరెత్తినట్లుగా అధికారులు
మిర్యాలగూడ,ప్రజాతంత్ర,ఆగస్ట్4 :
అధికార పార్టీ అండదండలతో ఓ ప్రజాప్రతినిది భర్త కనిపించిన ప్రతి ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకుంటూ బిందాస్‌గా తన దందాను కొనసాగిస్తున్నాడు. అడిగేవారు లేరని తనకు ఇష్టమోచ్చినట్లు వ్యవహరిస్తూ యధేచ్చగా  భూదందాలు చేస్తూ పేదలకు దక్కాల్సిన ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నాడు.
ఇదేమి అని ఏ అధికారి అయిన ప్రశ్నిస్తే తన పలుకుబడితో వారిని లొంగదీసుకుని తనకు ఎదురు లేకుండా భూకబ్జా సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోతున్నాడు  దీంతోపాటు ఏకంగా నకిలి ఇండ్ల పట్టాలను సృష్టించి అమాయకులకు విక్రయాలు జరుపుతున్న నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఓ అధికార పార్టీకి చెందిన వార్డు కౌన్సిలర్‌ ‌భర్త హద్దులు లేని అవినీతికి పాల్పడుతున్నట్లు వస్తున్న ఆరోపణలకు అధికారులు సమాధానం చెప్పలేకపోవడం గమనార్హం.

image.pngతండ్రి సమాధి పేరుతో కబ్జా పర్వం ప్రారంబం:
వాస్తవానికి ఇందిరమ్మ కాలనీలోని సర్వే నెంబర్‌ 5‌లో 10-16 కుంటల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో కొంత భూమి 6-37 కుంటలు రైతులకు ఆసైన్డ్ ‌చేసినట్లు రికార్డుల్లో పొందుపర్చారు. అయిన గాని మిగిలిన 3-13 టల ఈ ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు సదరు వ్యక్తి సమాధి పేరుతో కబ్జాను ప్రారంభించి మెల్లమెల్లగా మొత్తం ఆక్రమణకు పర్వం సిద్దం చేసాడు. తన భూకబ్జా విస్తరణకు తన తండ్రి సమాధితో ప్రారంభించాలనుకుని ముందుగా మిర్యాలగూడలోని హైదాలాపూర్‌ ‌సమీపంలో లో గల సర్వే నెంబర్‌ 5‌లో ఉన్న కొంత ఫ్రభుత్వ భూమిలో 4 కుంటలను ఆక్రమించుకుని అందులో తన తండ్రి జ్ఞాపకార్ధం సమాధి పేరుతో చూట్టు ప్రహారి గొడను నిర్మించుకున్నాడు.

కొంతకాలం తర్వాత పక్కనే ఉన్న మిగిలిన ప్రభుత్వ భూమిని తన అనుచర వర్గానికి కట్టబెడుతూ  దాదాపు 26 కుంటల భూమిని కబ్జా చేయించాడు.  మరికొన్ని రోజులు కనుక ఆగితే మొత్తం భూమి మాయం అయ్యేది. అదేవిధంగా ఇందిరమ్మ కాలనిలో గల సర్వే నెంబర్‌ 1 ‌లో 35 ఎకరాల 23 కుంటల ప్రభుత్వ భూమి ఉండగా అందులో ఇందిరమ్మ కాలనికి, సబ్‌ ‌స్టేషన్‌కు కొంత పోగా దాదాపు 30 కుంటలు మిగిలి వుంది.  అయితే సబ్‌ ‌స్టేషన్‌ ‌పక్కన గల 30 కుంటల భూమిలో  దాదాపు 20 కుంటల భూమిని కబ్జా చేసేందుకు అధికారుల సహకారంతో ప్రయత్నాలు సైతం మొదలుపెట్టినట్లు గుసగుసలు వినబడుతున్నాయి. ఇది ఇలా ఉంటే అసలు
సర్వే నెంబర్‌ 5‌లో మొత్తం ఉండాల్సి ప్రభుత్వ భూమి 10-16 కుంటలు. 1995 నుండి 2001 ఏడాది వరకు రికార్డులు భద్రంగానే ఉన్నాయి.  కానీ ఆ తర్వాత మాత్రం రికార్డుల్లో  14-22 కుంటల భూమి వస్తుంది ఇది ఏలా సాద్యమైందో రెవిన్యూ అధికారు)కే తెలియాలి.  అసలు భూమి ఏలా పెరిగిందో  వారి చేతివాటం ఎంత ఉందో రికార్డులు మార్పును బట్టి అర్ధమవుతుంది.

సెటిల్‌మెంట్‌ అం‌తా అక్కడే
ఇందిరమ్మ కాలనీలో ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్నందున వాటిని ఆక్రమించుకోవడానికి పేదలకు పట్టాల పేరుతో కొత్త దందాకు శ్రీకారం చూట్టాడు. ఇందిరమ్మ పట్టా లేకుండా కబ్జాలో ఉన్న వారిని గుర్తించి వారిపై తన అనుచరులతో పోలీస్‌ ‌స్టేషన్‌లో మొదటగా పిర్యాదు చేయిస్తాడు. ఆ తర్వాత తను రంగప్రవేశం చేసి అంతా తానుగా నడిపించి ఇరువురిని ఒప్పించి సెటిల్‌మెంట్‌ ‌చేస్తాడనే ఆరోపణలు ఉన్నాయి. సదరు వార్డు కె•న్సిలర్‌ ‌భర్త చేస్తున్న భూ దందాలపై  ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ భూములను కాపాడాలని పలువురు కోరుతున్నారు.

నకిలీ ఇండ్ల పట్టాలు- ఫోర్జరీ సంతకాలు
మిర్యాలగూడలోని ఇందిరమ్మ ఇండ్లను పేదలకు అప్పటి ప్రభుత్వాలు ఇచ్చాయి. ఇందులో చాలా భాగం అప్పటి పరిస్ధితుల్లో నివాస యోగ్యంగా లేకపోవడంతో అమ్ముకోవడం, వదిలి వెళ్లడం జరిగింది. దీన్ని అవకాశంగా తీసుకుని సదరు కౌన్సిలర్‌ ‌భర్త 2011-2013 మద్యకాలంలో పనిచేసిన తహసీల్దార్‌ల సంతకాలను ఫోర్జరి చేసి నకిలీ పట్టాలను విక్రియించినట్లు పలు ఆరోపణలు ఉన్నాయి. మిర్యాలగూడకు చెందిన ఓ వ్యక్తికి 2017లో పెండ్లి అయితే అతని భార్య పేరు మీద 2009లోనే  ఇంటి పట్టాను ఇవ్వడం ఇతనికే చెల్లింది. అదేవిధంగా ఎలాంటి ఆధారంలేని ఓ వృద్దురాలుకు నకిలీ ఇంటిపట్టాను ఇచ్చినట్లు తెలుస్తుంది.

ఒకే ఇంటి స్ధలం నెంబర్‌పై పలు నకిలీ పట్టాలు ఇవ్వడం వల్ల అసలు భాదితుడు కలెక్టర్‌కు సైతం పిర్యాదు చేసాడు. ఇప్పటి వరకు దాదాపు 20 నుండి 30 వరకు ఇలాంటి నకిలీ ఇంటి పట్టాలను ఇచ్చినట్లు సమాచారం. ఇతనికి టూటౌన్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌సమీపంలోని ఓ కంప్యూటర్‌ ‌కేంద్రం సహకారంతో నకీలి పట్టాలను ఇస్తున్నట్లు సమాచారం. దాంతోపాటు వారసులు లేనివారు, ఒంటరి జీవనం గడిపేవారు మరణించిన వారి సమాచారం తీసుకుని వారి ఇంటిని ఆక్రమించి మరోకరికి నకిలీ ఇంటి పట్టాను ఇస్తున్నట్లు ఆరోపణలు సైతం ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *