- గతేడాది మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉత్సవాలు
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5 : తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17ను గత సంవత్సరం మాదిరిగానే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సారి కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే అధికారికంగా నిర్వహిస్తామన్నారు. అతిథులుగా ఎవరు వొస్తారన్నది ఇంకా ధృవీకరణ కాలేదని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలవక ముందు కేసీఆర్ అధికారకంగా నిర్వహిస్తామన్నారని విషయాన్ని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
తెలంగాణ వొచ్చిన తరువాత.. అధికారంలోకి వొచ్చి ఇప్పుడు మాట తప్పారని పేర్కొన్నారు. మజ్లిస్ పార్టీ అధినేత ఒవైసీ ఒత్తిడి తలొగ్గి విమోచన కార్యక్రమాలు చేయడం లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. ఒవైసీకి కేసీఆర్ భయపడి కార్యక్రమాలు చేయడం లేదన్నారు. ఆనాటి కేంద్ర హోమ్ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణ గడ్డపైనా మువ్వన్నెల జెండా ఎగురవేశారన్నారు. ఇప్పుడు 70 ఏళ్ల తరువాత మళ్లీ అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ అయిన అమిత్ షా జెండా ఎగుర వేశారన్నారు. దేశానికి స్వాతంత్య్రం వొచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అమృత్ మహోత్సవాలు నిర్వహించామని కిషన్ రె్డ పేర్కొన్నారు.




