- బీఆర్‌ఎస్ గూండాలపై హత్యాయత్నం కేసు పెట్టాల్సిందే
- పిల్లలు, వృద్ధులను చంపే యత్నం చేస్తారా?
- కేసీఆర్ పాలనలో కుక్కలు పిల్లలను చంపుతున్నాయి…
- బీఆర్‌ఎసోళ్లు మనుషుల్ని చంపుకు తింటున్నారు.
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు
- తాండూరులో బీజేపీ నేత మురళీ గౌడ్ కుటుంబానికి పరామర్శ
తాండూరు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : హత్యలు, అత్యాచారాలు, భూకబ్జాలు, డ్రగ్స్ దందాలకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. తాండూరులో పోలీసుల సమక్షంలోనే బీజేపీ నేత మురళీగౌడ్ నివాసంపై దాడులు జరిపి పసిపిల్లలని చూడకుండా కుటుంబ సభ్యులను చంపే యత్నం చేసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ‘‘పోలీసులు చేతగానివాళ్లా? మాపై కూడా దాడులు జరిగాయని పోలీసులు చెప్పడం సిగ్గు చేటు…మీలాంటి వాళ్లకు డ్యూటీ ఎందుకు? తప్పుకుని ఇంట్లో కూర్చోండి’’ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తక్షణమే డీజీపీ స్పందించి బాధ్యులపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామలు ఎదుర్కునాల్సి ఉంటుందని హెచ్చరించారు. బుధవారం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, వీరేందర్ గౌడ్ సహా పలువురు బీజేపీ నేతలు, భారీ ఎత్తున కార్యకర్తలతో కలిసి తాండూరుకు వొచ్చిన బండి సంజయ్ మురళీ గౌడ్ నివాసానికి వెళ్లి మురళీ గౌడ్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
బీఆర్‌ఎస్ గూండాల దాడిని, పోలీసులు వ్యవహరించిన తీరును అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల ఆవేదనను చూసి చలించిపోయారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ….‘రెండ్రోజుల క్రితం గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ మురళీగౌడ్ నివాసంపై టీఆర్‌ఎస్ గూండాలు విచక్షణా రహితంగా దాడి చేశారు. ఆ కుటుంబాన్ని చంపే యత్నం చేశారు. తెలంగాణ సమాజమంతా చూసింది. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. బుద్ది, జానం ఉన్నోళ్లకు తెలుసు. స్వార్థ బుద్ధి ఉన్నవాళ్లకు ఇది తెలియదు. నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడినయ్యాక…మా పార్టీ కార్యకర్తలకు, ఇతర పార్టీ నాయకులకు కూడా చెప్పిన. ఇండ్ల మీద దాడి చేయడం తప్పు. మావాళ్లు ఎవరైనా దాడి చేస్తే యాక్షన్ తీసుకుంటానని చెప్పిన. రాజకీయాలతో కుటుంబ సభ్యులకు సంబంధం లేదు. మీకు చేతనైతే నేతలతో కొట్లాడండి. కానీ బలుపెక్కి డ్రగ్స్ తీసుకుని, మందుతాగి వొచ్చి దాడి చేశారు. వాళ్లను టెస్ట్ చేయాలి. మీరు బయట నుండి రాళ్లేస్తే ఇండ్లో చిన్న పిల్లలు, వ్రుద్దులుంటారు. తగల రాని చోట తగిలితే చనిపోతారని అనేక సందర్భాల్లో చెబుతున్న. అయినా అధికార పార్టీ నేతలకు బలుపెక్కింది.
ఇంకా ఎన్నిరోజులు అధికారంలో ఉంటారు? మురళీ మీపై ఆరోపణలు చేశారు. మీరు శుద్ధపూసలైతే వివరణ ఇవ్వండి. ప్రజలు గమనిస్తారు. ప్రజాభిమానం ఎవరికి ఉంది? ఎవరు డ్రగ్స్ తీసుకుంటారు? ఎవరు డ్రగ్స్ తీసుకుంటారు? ప్రజలు ఆలోచిస్తారు. అది చేతగాకుండా తాగిపించి, డ్రగ్స్ ఇచ్చి ఇట్లా (పిల్లలను చూపిస్తూ) పసి పిల్లలపై దాడులు చేస్తారా? వీళ్లకు ఏం సంబంధం? మురళీ నాన్న రిటైర్డ్ టీచర్.. ఆయనకు ఏం సంబంధం? దాడి చేసిన కుటుంబ సభ్యులకు ఈ వీడియో చూపించండి…చిన్న పిల్లలపై దాడి చేసి చంపే ప్రయత్నం చేశామని చెప్పండి… చెప్పు తీసుకుని కొడతారు. ఇంట్ల తిండికూడా పెట్టరు. రాజకీయాలతో పిల్లలకు ఏం సంబంధం? ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోండి. కుటుంబ సభ్యులకు ఏమైనా అయితే పిల్లలను ఎవరు ఆదుకుంటారు? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికైనా మీలో కొంచెమైనా మార్పు వస్తుందని అనుకుంటున్నా.
మీలో నిజాయితీ ఉంటే, మానవత్వం ఉంటే….దాడి చేయమని ఉసిగొల్పినవాడిని గల్లా పట్టి అడగండి. కొంచెమైనా సిగ్గుండాలే..ఇండ్లమీద దాడి చేసే సంస్కృతి ఏంది? తలుపులు పగలకొడతారా? పెట్రోలు చల్లుతారా? దాడి చేస్తారని పోలీసులకు ముందే తెలుసు.. తెలిసి కూడా దాడిని అడ్డుకోరా? దగ్గరుండి దాడి చేయిస్తారా? సిగ్గులేకుండా మాపై దాడులు చేశారని పోలీసులు చెబుతున్నారంటే సిగ్గుండాలె. ఇక చట్టాన్ని ఎవరు కాపాడాలే. ఇద్దరే కానిస్టేబుళ్లను అక్కడ ఉంచుతారా? దాడి చేస్తున్న వ్యక్తులను నిలువరించలేని స్థితిలో మీరుంటే… మీరు చేతగానోళ్లు. మీకు డ్యూటీ ఎందుకు? వెళ్లి ఇంట్లో కూర్చోండి. ఒకప్పుడు నక్సలైట్లను ఎదిరించి చంపుతారని తెలిసినా, బుల్లెట్లకు ఎదురొడ్డి ప్రాణత్యాగం చేసిన పోలీసులను గుర్తుంచుకోండి. అప్పుడైనా ధైర్యం వస్తదమో. ఈ జిల్లాలో పోలీసులు చేతగాని వ్యవస్థలో ఉన్నారు. వీళ్లను చూస్తే ఎన్ని లంగా దందాలైనా చేయొచ్చనే ధీమా క్రిమినల్స్ కు వస్తుంది. బీఆర్‌ఎసస్ నాయకుల ఆశీస్సులుంటే దోచుకోవచ్చనే భావన వొస్తుంది. పోలీస్ వ్యవస్థపై నమ్మకం కుదరాలంటే…. గూండాలను నిలువరించలేని పోలీసులపై చర్యలు తీసుకోవాలి.
అప్పుడే పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలుగుతుంది. పోలీసులపై దాడులు చేసినా కేసులు ఎందుక పెట్టలేదు? మిమ్ముల్ని చూసి కిందిస్థాయి సిబ్బంది సిగ్గు పడుతున్నారు. నిజాయితీగల పోలీసులు ఈ ఉద్యోగం వద్దని లూప్ లైన్‌కు పోతున్నరు. వాళ్ల డ్రైవర్ చనిపోయారు. ఇది హత్యే అనుమానం వ్యక్తమవుతుంది. దీనిపై ఎందుకు విచారణ జరపడం లేదు? మందుతాగి చనిపోయారని ప్రచారం చేయడమేంది? పోలీసులే వత్తాసు పలికితే ఎలా? పోలీసులు, బీఆర్‌ఎస్ నేతలను హెచ్చరిస్తున్నా…. మీ అధికారం 3 నెలలే. ఆ తరువాత మీ దుకాణం బంద్ అయితది. ఎవరూ లేనప్పడు మగతనం లేనివాడి లెక్క ఇండ్లపైకి వచ్చి దాడులు చేయడం పిరికితనం. కేసీఆర్ పాలనలో కుక్కలేమో పిల్లలను చంపుతున్నాయి… బీఆర్‌ఎసోళ్లు మనుషుల్ని చంపుకు తింటున్నారు. డీజీపీ వెంటనే స్పందించాలి. బాధ్యులపై హత్యాయత్నం కేసు పెట్టాలి. మురళీ గౌడ్ సోదరుడు విద్యుత్ శాఖ ఎంప్లాయి. అతని తలపగలకొట్టి హత్య చేసేందుకు కుట్ర చేశారు. విద్యుత్ సంఘం నాయకులు ఏం చేస్తున్నారు.
చిన్న చిన్న విషయాల్లో ఆందోళన చేస్తున్న మీరు మీ ఉద్యోగిని చంపబోతే ఎందుకు స్పందించరు? కాసులకు కక్కుర్తి పడి కొన్ని ఉద్యోగ సంఘాలు దాసోహమవుతున్నాయి. వీటివల్ల ఉద్యోగులకు న్యాయం జరగడం లేదు. సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు? బీఆర్‌ఎస్ నేతలు దాడులు చేసి అల్లర్లు సృష్టిస్తున్నా.. కుక్కల దాడిలో పసిపిల్లలు చనిపోతున్నా నోరెందుకు మెదపరు? దొంగ దందాలు చేసి విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి నిన్ను సీఎం చేసింది. పొద్దునలేస్తే ప్రధాని మోదీని తిట్టడానికి నిన్ను సీఎం చేయలేదు. దాడిని ఖండిస్తవా లేదా? చర్యలు తీసుకుంటావా? లేదా? ఇప్పటికైనా సీఎం స్పందించాలి. డీజీపీ స్పందించి బాధ్యులపై హత్యాయత్నం కేసు పెట్టాలి. మా లీగల్ టీమ్ త్వరలో వస్తది. న్యాయపరమైన చర్యలకు పూనుకుంటుంది. మా బీజేపీ నేతలు, కార్యకర్తలు భయపడే ప్రసక్తే లేదు.
జైలుకు పోయేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ 30, 40 శాతం జైలుకు పోయి వొచ్చారు.’ అని తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపకపోవడంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ….సాయన్న ఏమైనా పైసలున్నోడా? దళితుడు. పైసలున్నోడికి, రిగ్గింగ్ చేసి గెలిచినోళ్లకు అధికారికంగా అంత్యక్రియలు జరుపుతారు. వాడెవడో ఇస్తాంబుల్ చనిపోయిన నిజాం మనువడు చనిపోతే పెళ్లి కొడుకులా పిలిచి టోపీ పెట్టుకుని వెళ్లి అధికారికంగా అంత్యక్రియలు చేశాడు. తెలంగాణ మహిళల బట్టలిప్పి బతుకమ్మ ఆడించిన నీచ చరిత్ర నిజాం రాజుది. కేసీఆర్ కొడుకు సీఎం కావాలనుకున్నడు. ఆయన తొట్టి గ్యాంగ్ కేటీఆర్ సీఎం కావాలని సంతకాలు సేకరణ చేపడితే… సాయన్న సంతకం పెట్టలేదు. తెలంగాణ ఉద్యమకారులకు సీఎంగా అవకాశమివ్వాలని అడిగితే…అక్కసుతో కేసీఆర్ కొడుకు ఆదేశాల మేరకు అధికారికంగా అంత్యక్రియలు జరపలేదు. ఇది వాస్తవం…ఒక దళిత ఎమ్మెల్యే, పేదోడు. నీ పార్టీకి సేవ చేసినోడు. టీడీపీలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్‌కు సాయం చేసినోడు.. అయినా అవమానపర్చడం సిగ్గు చేటు.
దళిత సంఘాలు ఎటుపోయాయి? ఎందుకు స్పందించరు? దళిత బంధు ఇవ్వడం లేదు. దళితులకు మూడెకరాలు ఇస్తలేడు.. 5 సార్లు ఎమ్మెల్యేగా చేసిన సాయన్నకు అధికారికంగా అంత్యక్రియలు జరపకపోతే ఎందుకు స్పందించరు? ఎమ్మెల్యేకే ఈ పరిస్థితి ఉంటే దళితుల పరిస్థితి ఏంది? నిజాయితీగా సాయన్న గెలిచాడు. 5 సార్లు పైసలు ఖర్చు పెట్టకుండా గెలిచిన వ్యక్తి. సాయన్న చేసిన తప్పేంది? దళితుడనే అంత్యక్రియలు జరపలేదు. ఆయన ఆత్మ ఘోషిస్తోంది. దీనికోసమేనా సాయన్న పార్టీకి సేవలు చేసిందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారని బండి సంజయ్ అన్నారు. వరంగల్‌లో వేధింపులు భరించలేక ప్రీతి ఆత్మహత్యాయత్నం చేయడంపట్ల అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ….హత్యలు, అత్యాచారాలు, డ్రగ్స్, భూ దందాలకు కేరాఫ్ అడ్రస్ తెలంగాణగా మారిపోయిందని, బీఆర్‌ఎస్ నేతలు ఈ అడ్డగోలు దందాలతో రెచ్చిపోతున్నరని ఆరోపించారు. పక్కనే ఉన్న యాలాలలో విద్యార్థిని అత్యాచారం చేసి హత్య చేశారని అన్నరు బండి సంజయ్.




