అద్భుతమైన పూలవనం నిర్మిస్తా డాక్టర్ సుధీర్ రెడ్డి

మనసాపురం ప్రజాతంత్ర సెప్టెంబర్ 16: మాన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని ఆటోనగర్ యందు సుమారు రెండుకోట్ల ఎనబై ఎనిమిది లక్షల రూపాయల వ్యయంతో చేపట్టే రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ఎత్తుపల్లాలు సరిగ్గా చూసుకొని పనులు ప్రారంభం చేయాలని ఆదేశించారు.నియోజకవర్గ పరిధిలోని ప్రధాన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం చేయడం జరుగుతుందని అన్నారు.అలాగే ఆటోనగర్ డంపింగ్ యార్డు స్థలంగా రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన పూలవణం నిర్మించడం జరుగుతుంది అని తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి,మాజీ కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం చైర్మన్ ఈశ్వరయ్య యాదవ్,ఉద్యమకారులు కుంట్లూరు వెంకటేష్ గౌడ్,డివిజన్ అధ్యక్షులు జక్కిడి మల్లారెడ్డి,మాజీ అధ్యక్షులు టంగుటూరి నాగరాజు,జగదీష్ యాదవ్,యువ నాయకులు జక్కిడి రఘువీర్ రెడ్డి,పలు విభాగాల అధ్యక్షకార్యదర్శులు,ఉద్యమకారులు,పలు కాలనీవాసులు,అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *