దురదృష్టాన్ని దూరం చేయలేకపోయినా
అదృష్టాన్ని ఊహిస్తూ బ్రతికేస్తున్నా!
అదృష్టాన్ని ఊహిస్తూ బ్రతికేస్తున్నా!
అదేంటో… నేను!
నిజాన్ని చెప్పే దైర్యం రాకపోయినా
అబద్ధాన్ని నమ్మే స్థైర్యం అలవర్చుకున్నా!
నిజాన్ని చెప్పే దైర్యం రాకపోయినా
అబద్ధాన్ని నమ్మే స్థైర్యం అలవర్చుకున్నా!
అదేంటో….నేను!
వాస్తవంలో యాంత్రిక జీవనమైనా
కలల్లో రంగుల ప్రపంచమే కనుగొన్నా!
అదేంటో….నేను!
లోకానికి నేను ఏమీ పట్టక పోయినా
ప్రపంచానికి నేనే రాజని అనుకుంటున్నా!
అదేంటో…నేను!
ఎవ్వరికీ ఏమీ కాకపోయినా
ఎవరో ఒకరికి దగ్గర కావడానికి జీవితాంతం ప్రయత్నం చేస్తూనే ఉన్నా!..
ఉషారం
9553875577





