మిత్రమా!
నువ్వెప్పుడు ప్రత్యేకమే
నీది అభ్యుదయ మార్గమే
ఎప్పుడు ప్రశ్నించేది
క్రూరమృగాలను కాక
మేకలనెందుకు బలిస్తరనీ..
బలవంతుల కాదని
బలహీనులనెందుకు
బానిసలుగా జేస్తరనీ..
అణిచివేతలజూస్తేనే…
కండ్లల్ల నెగళ్లు పోగేసేది
దోపిడీ దౌర్జన్న్యాలంటేనే..
నరాల నెత్తుర్ల మరిగించేది
పడమటి చీకటి బతుకులన్నా
ఊరావలి వెట్టి మనుషులన్నా
నీకెంత తపన ఉండేదో కదా !
అందుకే..!
వారి కంట వెలుగుల నింప
విప్లవకారిగా రూపేత్తుకుని
ఎర్ర దారుల్లో పోరుతున్నావు
అగ్నిశిఖవై ప్రజ్వలించావో
అణ్వస్త్రమై విస్ఫోటించావో
విచ్చుకత్తివై మెరిసావో
విల్లంబువై విరబూసావో




