•కాంగ్రెస్ సీనియర్ నాయకులు మర్రి దుర్గేష్ విజ్ఞప్తి
ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13 : తానతో పాటు తమ తాత, తండ్రి మూడు తరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి తమ జీవితాలను అంకితం చేసిన తన కుంటుంబానికి న్యాయం చేసేలా తనకు అచ్చంపేట్ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మర్రి దుర్గేష్ విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో రెబల్ గా బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ మేరకు శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత రెండు దఫాలుగా అసెంబ్లీ టికెట్ పొంది ఓడిపోయిన చిక్కుడు వంశీకృష్ణకు మళ్ళీ టికెట్ కేటాయిస్తే కచ్చితంగా పార్టీ ఓటమి పాలవుతుందని అన్నారు. తరతరాలుగా పార్టీకి సేవ చేసిన తాము కార్యకర్తలుగానే మిగిలిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీ టికెట్ కు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. తాను గెలిచిన తరువాత ప్రభుత్వ నిధులే కాకుండా తన స్వంతంగా ప్రతీ మండలానికి రూ.2 కోట్లు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలు చెపడతనని చెప్పారు. ఈ సమావేశంలో నచికేత్ శాస్త్రి, ఎర్ర రమేష్, టీ.చంద్రశేఖర్ పాల్గొన్నారు.




