మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 10: అఖిల భారత యాదవ రంగా రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులుగా ఏంఏంసి కార్పొరేటర్ ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్ నియమితులైనారు. గురువారం జరిగిన అఖిల భారత యాదవ మహాసభ రంగా రెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశంలో ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్ కు జిల్లా అధ్యక్షులు బర్ల జగదీశ్ యాదవ్ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. అఖిల భారత యాదవ మహాసభ రంగా రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించిన పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు. మహాసభ ఆదేశాల మేరకు యాదవ కులస్తులు రాజకీయంగా, ఆర్థికంగా, విద్యా పరంగా అన్ని రంగాలలో రాణించే విధంగా కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మరిపల్లీ అంజయ్య, అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర నాయకులు కసారమోని మల్లేష్ యాదవ్, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి నడికుడి రఘునాథ్ యాదవ్, మహేశ్వరం నియోజకవర్గ అధ్యక్షులు మేకల కృష్ణ యాదవ్, యాదవ సోదరులు దేవన మొని శ్రీనివాస్ యాదవ్, గుమ్మా రామకృష్ణ యాదవ్, చందు యాదవ్, ఎనుగుల శివా యాదవ్, గనేశ్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, జక్కుల గోపాల్ యాదవ్, సుధాకర్ యాదవ్, సూదీప్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.




