తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7: తాండూరు పట్టణంలో అక్షర పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గురువారం సాయిపూర్ రోడ్డులో గల అక్షర పాఠశాలలో శ్రీ కృష్ణాష్టమి వేడుకల పురస్కరించుకొని కృష్ణుడు గోపికల వేషధారణలతో చిన్నారి విద్యార్థులు ఆటపాటలతో హొరెత్తించారు. వేడుకల్లో భాగంగా చిన్నారి విద్యార్థులు మహాభారతంలోని కృష్ణ దుర్యోధన ఘట్టాలను నాటక రూపంలో చేసి అద్భుతంగా అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీ ఉత్తరాది మాఠం అర్చకులు శ్రీ సుధీర్ పంతులు హాజరై శ్రీకృష్ణుని జన్మ వృత్తాంతం మరియు వారి జీవితం సమస్త మానవాళికి ఆదర్శమని వివరించాడు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోహన్ కృష్ణ గౌడ్ మాట్లాడుతూ ఎంత కష్టం వచ్చినా ధర్మం వైపు మాత్రమే నిలబడాలని అదేవిధంగా నిరంతరం కర్మ ఆచరించాలని అదే కృష్ణ భగవానుడు మానవాళికి ఇచ్చిన సందేశం అని అన్నారు. కార్యక్రమానికి హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులు చిన్నారులు చేసిన ఆటపాటలను చూసి ఆనందంతో ఎంతగానో మై మర్చిపోయారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ప్రవీణ్ శ్రీకాంత్ యూనుస్ రవీందర్ శోభారాణి శ్రీనివాస్ రెడ్డి ముస్కాన్ అనూష అనిత పాఠశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.ఫోటో రైట్ అప్..04, శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో చిన్నారి విద్యార్థుల ఆటపాటలు.
ఫోటో రైట్ అప్…05, శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో మాట్లాడుతున్న ముఖ్య అతిథి పాఠశాల ప్రధానోపాధ్యాయులు.




