అక్రమ నిర్మాణం అడ్డుకుని మా ఇంటిని కాపాడండి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 28 : తమ ఇంట్లోకి గాలి, వెలుతురు రాకుండా ఇంటికి ఆనుకొని ప్రభుత్వ స్థలంలో చేస్తున్న అక్రమ నిర్మాణాన్ని నిలిపివేసి తమ ఇంటిని కాపాడాలని బాధిత కుటుంబ సభ్యులు సునీల్ శర్మ, సరోజ్ శర్మ, జ్యోతి శర్మలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 13 ఏళ్ల క్రితం బేగం బజార్ జెన్సీచోరైలో తాము నిర్మించుకున్న ఇంటి నెం(14-9-6/9A) పక్కన ఉన్న 23 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా తమ ఇంటికి వెంటిలేషన్ రాకుండా 35 గజాలకు జిహెచ్ఎంసి పర్మిషన్ తీసుకొని 65 గజాల్లో రెండంతస్తుల ఇంటి నిర్మాణం చేపడుతున్న ఇంద్రపాల్ సింగ్, ఎల్.సోనావతిలపై ప్రభుత్వం చర్యలు తీసుకుని న్యాయం చేయాలన్నారు. అక్రమ ఇంటి నిర్మాణం ఆపాలని జూనియర్ సివిల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం లెక్కచేయడం లేదన్నారు. అక్రమ నిర్మాణం అడ్డుకుంటున్న తమపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై జిహెచ్ఎంసి అధికారులకు, పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవడం లేదని వాపోయారు. కబ్జాదారులతో జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులతో కుమ్మక్కయ్యి అక్రమ నిర్మాణానికి ఒడిగట్టారని ఆరోపించారు. గత ఏప్రిల్ లో జిహెచ్ఎంసి అధికారులకు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ 15 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని ఇప్పటివరకు పట్టించుకోవడంలేదని అన్నారు. ఈ విషయంలో సిఎం కేసిఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ లు జోక్యం చేసుకుని అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *