-పోలీస్ విచారణలో నేరం అంగీకారం
హైదరాబాద్,ప్రజాతంత్ర,మార్చి
—–
దిల్లీ అగ్నిప్రమాదంలో 9మంది మృతి
-నాలుగు అంతస్థుల భవనం అగ్నికి ఆహుతి
న్యూదిల్లీ,మార్చి18: దిల్లీలోని పాలెంలో అగ్నిప్రమాదం జరిగిన ఘటనలో 9 మంది మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. రామ్ చౌక్ మార్కెట్‌లో ఉన్న 4 అంతస్తుల భవనంలో ఉదయం 7 గంటలకు అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. ఆ సమయంలో చాలా మంది నిద్రలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ భవనం బేస్మెంట్, గ్రౌండ్‌ఫ్లోర్‌లో బట్టల దుకాణంతో పాటు కాస్మెటిక్స్ షోరూం కూడా ఉన్నది. అయితే బిల్డింగ్‌లోని టాప్ రెండు ఫోర్లలో ఆ ఇంటి యజమానులు ఉంటున్నారు. అగ్నిప్రమాదంలో మృతిచెందిన వారిని ప్రవేశ్, కమాల్, ఆశు, లాడో, హిమాన్షి, దీపికతో పాటు ముగ్గురు మైనర్ బాలికలు ఉన్నారు. అనిల్, సచిన్‌తో పాటు మరో రెండు ఏళ్ల అమ్మాయి గాయపడ్డారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది. పాలంకు చెందిన పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. దిల్లీ అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బిల్డింగ్ ఓనర్‌ను రాజేంద్ర కశ్యప్‌గా గుర్తించారు. కుటుంబసభ్యులు బిల్డింగ్‌లోని రెండో, మూడో ప్లోర్లలో నివసిస్తున్నారు. 20 ఫ్లైర్ టెండర్లు, 11 సీఏటీఎస్ అంబులెన్సులు, బీఎస్‌ఈఎస్, ఎయిర్ ఫోర్స్ పోలీసు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఫోరెన్సిక్ బృందం చేరుకున్నది. స్థానిక పోలీసులు ఘటనపై విచారణ చేస్తున్నారు.
——-
దమ్ముంటే ఎన్‌కౌంటర్ చేయండి
-పోలీసులకు సవాల్
-పోలీసు కాల్పుల్లో గ్యాంగ్‌స్టర్ హతం
-బీహార్ చంపారణ్‌లో ఘటన
పాట్నా,మార్చి18:తనను ఎన్‌కౌంటర్ చేసేందుకు ప్లేసు, టైం చెప్పాలంటూ ఒక గ్యాంగ్‌స్టర్ పోలీసులకు సవాల్ విసిరాడు. తర్వాత పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఈ ఘటన బీహార్‌లోని చంపారణ్ జిల్లా మోతిహరి పట్టణ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రాంతంలో కుందన్ ఠాకూర్ కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ అనేక నేరాలకు పాల్పడ్డాడు. దీంతో అతడిపై పలు కేసులు నమోదయ్యాయి. కొంతకాలంగా ఠాకూర్, అతడి గ్యాంగ్ అజ్ఞాతంలో ఉన్నారు. ఇటీవల ఠాకూర్ పోలీసులకు సవాల్ విసిరాడు. వారిని హెచ్చరిస్తూ ఆడియో సందేశాలు పంపాడు. ముఖ్యంగా చకియా పోలీస్ స్టేషన్ ఆఫీసర్‌కు నేరుగా హెచ్చరికలు జారీ చేశాడు. తనను పట్టుకునేందుకు ఎంత మంది పోలీసులు వచ్చినా వారి అంతుచూస్తానని, దమ్ముంటే ప్లేస్, టైం చెప్పాలంటూ సవాల్ విసిరాడు. తనను ఎన్‌కౌంటర్ చేయాలనుకుంటే ఎందరో పోలీసుల ప్రాణాలు పోతాయని హెచ్చరించాడు. పోలీసులు తన కుటుంబాన్ని వేధిస్తున్నారని, వాటిని ఆపకుంటే తాను కూడా పోలీసుల కుటుంబాల అంతు చూస్తానని వార్నింగ్ ఇచ్చాడు. తాను పారిపోవడం లేదని, ఎన్‌కౌంటర్‌లో ఎంతమంది పోలీసుల్నైనా ఎదుర్కొంటానన్నాడు. ఇది హెచ్చరిక కాదని, సలహా మాత్రమే అని చెప్పుకొచ్చాడు. అయితే, అప్పటికే అతడి కదలికలపై నిఘా పెట్టిన పోలీసులకు తగిన సమాచారం అందింది. ఠాకూర్, అతడి అనుచరులు ఉన్న ప్రదేశం గురించి సమాచారం అందుకున్న ప్రత్యేక బృందం ఆ ప్రదేశాన్ని చుట్టుముట్టింది. ఈ క్రమంలో ఠాకూర్ గ్యాంగ్ రెచ్చగొట్టే చర్యలకు దిగింది. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఇరుపక్షాల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక ఎస్టీఎఫ్ జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయాడు. తమ సహచరుడు మరణించినప్పటికీ పోలీసులు ఠాకూర్ అండ్ గ్యాంగ్‌కు వ్యతిరేకంగా కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో కుందన్ ఠాకూర్‌తోపాటు మరో ఇద్దరు క్రిమినల్స్ కూడా హతమయ్యారు.
———————
ఎస్‌ఐ భార్య ఆత్మహత్య
కరీంనగర్,ప్రజాతంత్ర,మార్చి
——
తండ్రీ కూతుళ్లను హత్య చేసిన అల్లుడు
-ఆపై పెట్రోల్ పోసి తగులబెట్టిన దుండగుడు
హన్మకొండ,ప్రజాతంత్ర,మార్చి18:



