వరంగల్,ప్రజాతంత్ర,మార్చి18:అన్
అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. చేతికి అందిన వరి, మిర్చి పంటను కాపాడుకోవడం కోసం పడరానిపాట్లు పడుతున్నారు రైతన్నలు. కలాల్లో అరబోసిన మిర్చి పంటను పాలిథిన్ కవర్లతో కప్పి వర్షంలో తడవకుండా కాపాడు కుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజుల నుండి వాతావరణంలో మార్పులు సంభవించాయి. ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచిస్తున్న నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చేతికి అందిన పంట పూర్తిగా వర్షాలపాలైపోతుందని దిగులుతో తలలు పట్టుకుంటున్నారు.




