ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,సెప్టెంబర్ 25: చేవెళ్ల మండల పరిధిలోని ఇబ్రహీంపల్లి గ్రామ అంబేద్కర్ సంఘం నూతన అధ్యక్షునిగా ఎర్రవల్లి వెంకట్ రాజు,ఉపాధ్యక్షులుగా ప్రభాకర్,కార్యదర్శి బేగరి శ్రీనివాస్,సంయుక్త కార్యదర్శి వెంకటేష్,ట్రెజరర్ ఎర్రవల్లి రమేష్ లను గ్రామ అంబేద్కర్ సంఘం యువకులంతా కలిసి ఎన్నుకోన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం మేమంతా కలిసికట్టుగా పనిచేస్తామని గ్రామంలో ఏదైనా సమస్య ఉంటే కమిటి మెంబర్ల దృష్టికి తీసుకువెళ్లి అంబేద్కర్ కమిటీ మెంబర్లతో సంప్రదింపులు జరిపి సమస్య పరిష్కారానికి మేము కలిసికట్టుగా ఉండి సమస్యను పరిష్కరిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ కమ్మెట నరసింహ,బ్యాగరి సత్యం,శంకరయ్య,జంగయ్య (అఖిల్ ),ఎర్రవల్లి బాలయ్య,యాదయ్య, శ్రీనివాస్,రాములు,నర్సింలు, కోనాయ్ జంగయ్య,కమ్మెట జంగయ్య,కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




