అంబేద్కర్ జీవితం సదా ఆచరణీయం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 6:  రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం నేటి తరాలకు సదా ఆచరణీయమని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని పటాన్ చెరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే జిఎంఆర్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అసమానతలు తొలగించి, ప్రతి ఒక్కరికి సమానత్వం, సౌబ్రాతత్వం, రిజర్వేషన్లు అందించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ అని కొనియాడారు. అన్ని వర్గాల వారికి సమన్యాయం జరగాలనే దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్, భారతదేశ అస్తిత్వపు ప్రతీకగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్,  బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, దళిత సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *