అం‌ధత్వ రహిత తెలంగాణ.. ప్రభుత్వ లక్ష్యం

  • అద్భుతంగా కొనసాగుతున్న కంటి వెలుగు
  • 25 రోజుల్లో 50 లక్షల మార్కును దాటిన పరీక్షలు
  • చివరి వ్యక్తి వరకు కంటి పరీక్షలు
  • కెసిఆర్‌ ‌లక్ష్యాన్ని విజయవంతం చేస్తున్న అధికారులు
  • పరీక్షల నిర్వహణలో సిద్దిపేట ముందుందన్న మంత్రి హరీష్‌ ‌రావు

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23 : అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంగా నినాదంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి హరీశ్‌ ‌రావు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆలోచనతో ప్రారంభించిన కంటి వెలుగు అద్భుతంగా కొనసాగుతున్నదని ప్రశంసించారు. కంటి వెలుగు కార్యక్రమంతో ప్రజలకు ఆనంద భాష్పాలు వొస్తుంటే ప్రతిపక్షాలకు కన్నీళ్లు వొస్తున్నాయని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలోని 26వ వార్డు ఏకలవ్య సంఘం భవనంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని మంత్రి హరీష్‌ ‌రావు పరిశీలించారు. ప్రతీ గ్రామంలో కంటి వెలుగు శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు. ఇప్పటి వరకు1,68,062 మందికి కంటి పరీక్షలు నిర్వహించి సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో ఉందని మంత్రి కొనియాడారు. సర్వేంద్రియానాం..నయనం ప్రధానం అన్న వ్యాఖ్యను గుర్తుచేస్తూ..దృష్టి లోపాన్ని నివారించేందుకు సీఎం కేసీఆర్‌ ‌కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు.

ప్రజలందరూ సీఎం కేసీఆర్‌ను తమ పెద్ద కొడుకులా భావిస్తున్నారని, ఈ రోజుకు కంటి పరీక్షలు 50 లక్షల మార్కును చేరుకున్నామని తెలిపారు. కేవలం 25 రోజుల సమయంలోనే ఈ రికార్డు సాధించామన్న మంత్రి హరీష్‌ ‌రావు…ఇందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తిని చివరి వరకు కొనసాగించాలని సూచించారు. కుల, మత ప్రాంతాలకు అతీతంగా పక్క రాష్ట్రాల వారికి కూడా కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలు అందజేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 16 లక్షల మంది ప్రజలు కంటి చూపుతో భాధపడుతున్నట్లు గుర్తించామని చెప్పారు. వారికి కంటి వెలుగులు ప్రసాదించిన నాయకుడు సీఎం కేసీఆర్‌ అని పొగడ్తలతో ముంచెత్తారు. ఇందులో అధికంగా మహిళలే ఉన్నారన్న మంత్రి…గతంలో చైనా నుంచి అద్దాలను దిగుమతి చేసుకుంటే.. ఈసారి మేడిన్‌ ‌తెలంగాణ కంటి అద్దాలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు.

పంజాబ్‌, ‌దిల్లీ సీఎంలు సైతం ఈ కార్యక్రమం బాగుందని కితాబిచ్చినట్టు గుర్తు చేశారు. రెండో విడత కంటి వెలుగు కోసం రూ.250 కోట్లు ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ సహకరిస్తున్న ప్రతి శాఖకు చెందిన అధికారులు, సిబ్బందికి ధన్యవాదాల అని, రాష్ట్రంలో చివరి వ్యక్తికి పరీక్ష చేసే వరకు కంటి పరీక్షలు కొనసాగుతాయని హరీష్‌ ‌రావు హావి• ఇచ్చారు. తెలంగాణ ప్రజలు ఎవరూ కూడా కంటి సమస్యతో బాధ పడకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కంటి వెలుగు అనే మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. పండుగ వాతావరణంలో జరుగుతున్న కంటి వెలుగులో నేటికి 50 లక్షల మందికి పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు. 25 పని దినాల్లో ఇంత పెద్ద సంఖ్యలో పరీక్షలు చేయడం, అవసరం ఉన్నవారికి అద్దాలు పంపిణీ చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు.

హాస్పిటళ్ల వద్దకు ప్రజలు రావడం కాదు, ఊరుకు, వాడకు ప్రభుత్వమే కదిలి వొస్తున్నదని చెప్పారు. ఉచితంగా కంప్యూటరైజ్డ్ ‌కంటి పరీక్షలు నిర్వహించి, మందులు, అవసరం అయిన వారికి కళ్లద్దాలు పంపిణీ చేస్తున్నదని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగులో భాగస్వామ్యం అయిన సహచర మంత్రులకు, శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, జిల్లా పరిషత్‌ ‌చైర్మన్లకు, కార్పొరేషన్‌ ‌చైర్మన్లకు, మున్సిపల్‌ ‌చైర్మన్లకు, జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచులు, ఎంపీటీసీలకు ప్రజాప్రతినిధులు, అధికారులకు మంత్రి హరీష్‌ ‌రావు ధన్యవాదాలు తెలిపారు. కార్మక్రమంలో రోజాశర్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *