కుల్కచర్ల, ప్రజాతంత్ర ఆగస్ట్,17: ప్రజలకు అందుబాటులో లేని కరెంటు ఏఈ హైమద్ పాషా పై తక్షణమే చర్య తీసుకోవాలని మండల పార్టీ అధ్యక్షుడు గాదె మహిపాల్ ముదిరాజ్, జిల్లా కార్యవర్గ సభ్యులు సురేందర్ గౌడ్ అన్నారు.గురువారంనాడు మండల కేంద్రంలోని బీజేపీ కార్యక్రమంలో ఓ ప్రకటనలో తెలిపారు..ఈ కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడారు. కుల్కచర్ల మండల ప్రజలకు, రైతులకు అందుబాటులో లేని ఎఈ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అకాల వర్షాల వల్ల రైతుల పొలాల్లో కరెంటు వైర్లు కిందకు వేలాడుతున్న, చాలా గ్రామాల్లో ఆవులు, మేకలు,గేదెలు చనిపోయిన సందర్భం చాలా ఉన్నాయని తెలిపారు.ఈ సమస్యలపై విద్యుత్ కార్యాలయాని వెల్లి మొరపెట్టుకుందామంటే ఎప్పుడు కూడా రైతులకు అందుబాటులో లేకుంటాడని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చాలా సందర్భల్లో మండల ప్రజలు ఏఈ కి ఫోన్ చేసిన కనీసం ఫోన్ కూడా ఎత్తని సందర్భాలు చాలా ఉన్నాయి.అటు రైతులకు ఇటు మండల ప్రజానీకానికి అందుబాటులో లేని ఎఈని పై అధికారులచేత ఎంక్వయిరీ చేయించి వెంటనే విధుల నుండి తొలగించాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. ఎఈపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాంమని అన్నారు.ఈ కార్యక్రమంలో దళిత మోర్ఛ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగ్యం శ్రీనివాస్,బీజేవైఎం మండల అధ్యక్షులు గడుసు మహిపాల్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు సందని బిచ్చయ్య, మండల ట్రెజరర్ చల్లాపూర్ ఆంజనేయులు, చెన్నయ్య పాల్గొన్నారు.


