అందరికీ ఇచ్చారు అవకాశం ఆచారి కి ఇవ్వండి ఒక్క అవకాశం

 ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 2 : ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన కల్వకుర్తి నియోజకవర్గం అభివృద్ధి ఏడేసిన గొంగళి ఆడే అన్నట్టుగా ఉందని అందరికీ ఇచ్చారు అవకాశం ఆచారికి ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ బిజెపి అభ్యర్థి ఆచారి ప్రచారాన్ని మ మ్మరం చేశారు.  కడ్తాల్ మండలం, పల్లేచేలుకతండా లో వివిధ పార్టీలకు చెందిన 150 మంది కార్యకర్తలు బిజెపిలో చేరారు. వారందరినీ ఆచారి బిజెపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదేవిధంగా  చరికోండ వేణుగోపాల్ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారం ను ప్రారంభించారు. ముద్విన్, ఎక్వయిపల్లి గ్రామపంచాయతీలో గడపగడపకు తిరుగుతూ కమలం గుర్తుకు ఓటేయాలని ఓటర్లను ప్రాధాయపడ్డారు. తనకు ఒక అవకాశం ఇచ్చి అసెంబ్లీకి పంపిస్తే మీ పక్షాన పోరాటం చేసి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పరుస్తానని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో  కడ్తాల్ మండలం అద్యక్షుడు మాన్య నాయక్, గిరి గిరిజన మోర్చా నాయకుడు సాయిలాల్, రాందాస్, వీరయ్య, నరేందర్, మోహన్ రెడ్డి, మహేష్, భగిరథ్, జలగం రవి, సాయిలు, వెంకటేష్, నర్సిరెడ్డి, అభిలాష్ రెడ్డి, రేడ్య, చందన్ బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *