అంతర్వేదిలో తాడేపల్లిగూడెం ప్రపంచ సాహిత్య కళా ఉత్సవాలు  బ్రోచర్  ఆవిష్కరణ

 ఎల్బీనగర్ ప్రజాతంత్ర, నవంబర్ 28: ఐ. ఎస్ .ఓ గుర్తింపు పొందిన ప్రపంచంలోనే అతి పెద్ద సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవాసంస్థ శ్రీ శ్రీ కళా వేదిక ప్రతి నెలా సాహితీ ప్రభంజనంలో భాగంగా  డిసెంబర్ నెలలో 16, 17  తారీఖులలో తాడేపల్లిగూడెంలో 30 గంటల 30నిముషాల 30 సెకన్ల పాటు నిరంతరాయంగా  శ్రీ శ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్  సారథ్యంలో, అంతర్జాతీయ సమన్వయకర్త కొల్లిరమావతి ఆధ్వర్యంలో జరుగబోయే ప్రపంచ తెలుగు సాహిత్య-కళా ఉత్సవాలు బ్రోచర్ ఆవిష్కరణ జరిగింది.  మంగళవారం తెలంగాణా రాష్త్ర కార్యదర్శి, ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాల ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శి గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాద్ అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ సన్నిధిలో కార్తీక పౌర్ణమి రోజున కుటుంబ సమేతంగా ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా రాజేంద్రప్రసాద్  ట్లాడుతూ..9 సంవత్సరాల క్రితం సాహితీ ప్రస్థానం ఈ అంతర్వేదిలోనే ప్రారంభం అయ్యిందన్నారు. ఇక్కడే పలుమార్లు ఎన్నో సత్కారాలను అందుకున్నానని, వరల్ద్ బుక్ ఆఫ్ రికార్డ్ లో కూడా తన పేరున తొలినమోదు కూడా ఇక్కడే జరిగిందని సంతోషాన్ని వ్యక్తపరిచారు. అలానే కత్తిమండప్రతాప్ తో శ్రీ శ్రీ కళావేదిక సంస్థలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ నేడు శ్రీ శ్రీ కళావేదిక కార్యక్రమానికి సంబందించిన బ్రోచర్ ను అంతర్వేదిలో స్వామి వారి సన్నిధిలో ఆవిష్కరణ చేయటం తాను ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. తెలుగు భాషాభిమానులందరూ ఈ కార్యక్రామనికి పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చెయ్యాలని కోరారు. తెలుగు భాషాభివృద్దికి, ఔనత్యానికి శ్రీ శ్రీ కళావేదిక ఎప్పుడూ కృషి చేస్తుందని, ఎందరో కవులను, కళాకారులను శ్రీ శ్రీ కళావేదిక ప్రోత్సాహాన్ని అందిస్తూ వారికి అండగా ఉంటుందని తెలియజేసారు. ఇటువంటి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటూ సాహిత్యరంగంలో రాణించాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *