పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని 6వ వార్డ్ పిజెఆర్ ఎన్క్లేవ్ లో 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న అంతర్గత మరుగునీటి డ్రైనేజ్ నిర్మాణ పనులకు అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రధమ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు అవినీతికి తాపు లేకుండా పారదర్శకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అలాగే అమీన్ పూర్ మున్సిపాలిటీ క్లీన్ అండ్ గ్రీన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ మహాదేవరెడ్డి, కల్పన ఉపేందర్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు తల్లారి రాములు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు శేఖర్, మహేందర్ రెడ్డి, నల్ల మాధవరెడ్డి, కొండకల శ్రీనివాస్, కొల్లూరి యాదగిరి, చౌటకూరి మైపాల్ రెడ్డి, ఆంజనేయులు, కాలనీ వాసులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.




