ప్రపంచ అంతరిక్ష వారం ప్రతి సంవత్సరం అక్టోబరు 4వ తేదీ నుండి అక్టోబరు 10వ తేదీ వరకు వారం రోజుల పాటు నిర్వహించ బడుతుంది. మానవ ప్రగతిని మెరుగు పడటానికి కారణం అవుతున్న సైన్స్ అండ్ టెక్నాలజీకి గుర్తుగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఈ దినోత్సవం జరుప బడుతుంది. 1957, అక్టోబరు 4న స్పుట్నిక్ 1అనే తొలి మానవ నిర్మిత ఉపగ్రహాన్ని ప్రారంభించి అంతరిక్ష అన్వేషణకు శ్రీకారం చుట్టగా, 1967 అక్టోబరు 10న చంద్రునితో సహా ఇతర ఖగోళ ప్రాంతాలలో అన్వేషణ వివిధ దేశాల కార్యకలాపాల నిబంధనలపై సంతకం చేయబడిరది. అక్టోబరు 4, అక్టోబరు 10 తేదీలు ప్రపంచ అంతరిక్ష చరిత్రలో చారిత్రక సంఘటనలకు గుర్తుగా 1999, డిసెంబరు 6న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ఆ రెండు రోజుల మధ్య ఉన్న వారాన్ని అంతరిక్ష వారంగా ప్రకటించ బడిరది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వార్షిక అంతరిక్ష కార్యక్రమం. ‘‘విక్రం సారాభాయ్ ని భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు పితామహుడిగా’’ అభివర్ణిస్తారు.
1957లో రష్యా మొట్టమొదటి శాటిలైట్ అయిన స్పుత్నిక్‌ను ప్రయోగించి నపుడు శాటిలైట్ యొక్క ఆవశ్యకతను అప్పటి ప్రధాన మంత్రి అయిన నెహ్రూకు వివరించి, 1962లో, భారత అణుశక్తి వ్యవస్థ పితా మహుడయిన హోమీ భాభా పర్యవేక్షణలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ (INCOSPAR)) ను ఏర్పరచాడు.కేరళలో త్రివేండ్రం వద్ద తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ (TERLS)) నెలకొల్పి అమెరికా, రష్యాల నుండి దిగుమతి చేసుకున్న రాకెట్లను ప్రయోగిస్తూ ఉపరి తలాన్ని అధ్యయం చేయడం మొదలు పెట్టారు. అనతికాలంలోనే భారతదేశం స్వదేశీయంగా పూర్తి స్థాయి రాకెట్లను తయారు చేసి, ఉపరితల అధ్యయంలో పురోగతి సాధించింది. ఉపగ్రహాలను తయారు చేయడమే కాకుండా వాటిని ప్రయోగించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండాల్సిన ఆవశ్యకతను గుర్తించిన సారాభాయ్, ఉపగ్రహ వాహకనౌక రూపకల్పన మొదలు పెట్టాడు. అలా తయారైనదే సెటిలైట్ లాంచ్ వెహికిల్ (SLV).
ఇస్రో తయారు చేసిన తొలి పూర్తిస్థాయి ఉప గ్రహానికి భారత గణిత, ఖగోళ శాస్త్రవేత్త అయిన ‘‘ఆర్యభట్ట’’ పేరు పెటారు. భారత దేశపు మొట్ట మొదటి ఉపగ్రహం ఆర్యభట్టను 1975 ఏప్రిల్ 19న అప్పటి సోవియట్ యూనియన్ నుండి విజయ వంతంగా ప్రయోగించారు.
ఇన్‌శాట్ – INSAT లేదా భారత జాతీయ ఉపగ్రహ వ్యవస్థ (Indian National Satellite System) అనేది సమాచారం, వాతావరణం, ప్రసారాలు మొదలయిన బహుళ ప్రయోజనాల కోసం ఇస్రో తయారు చేసిన ఉపగ్రహాల శ్రేణి. 1983లో మొదలయిన ఇన్‌శాట్, ఆసియా, పసిఫిక్ దేశాల్లో అతిపెద్ద ఉపగ్రహాల వ్యవస్థ. ప్రస్తుతం 199 ట్రాన్స్ పాండర్లతో భారతదేశం లోని దాదాపు అన్ని టెలివిజన్, రేడియోలకు మాధ్యమంగా ఉన్న ఈ ఉపగ్రహాలను కర్నాటకలోని హస్సన్, భోపాల్ ల నుండి అనుక్షణం పర్యవేక్షిస్తుంటారు. తద్వారా అంతరిక్ష పరిశోధనల్లో మన దేశం ఎంతో ముందంజలో ఉందని కొనియాడారు. అంతరిక్ష ప్రయోగాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడతారని ప్రశ్నించే వారికి… దీపావళి పండుగ కోసం పటాసులు కాల్చడానికి దాదాపు 600 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తారనేది ఒక అంచనా ఉందని, అయితే మంగళయాన్ ప్రయోగం కోసం ఇస్రో కేవలం వెయ్యి కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి విజయం సాధించడం గొప్ప పరిణామమని ఆయన ధీటైన సమాధానం చెప్పారు.
ప్రపంచ దేశాలు చేయలేని సాహసం ఇస్రో చేపట్టిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మంగళయాన్ సక్సెస్‌తో భారత్ ప్రపంచ దేశాల సరసన చేరిందని వెల్లడిరచారు. అంతరిక్ష రంగంలో అధునాతన సామర్థ్యాలు కలిగి ఉన్న కొన్ని దేశాలలో భారత్ ఒకటి. భారత్ లో ప్రతిష్ఠాత్మక ప్రయోగ కేంద్రాలు ఉన్నాయి…1.తుంబా: కేరళలో తిరువనంత పురం సమీపాన భూ అయస్కాంత రేఖకు దగ్గరలో ఉన్న తుంబాలో 1962లో మొదటి రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని నిర్మించారు. అప్పటి శాస్త్రవేత్తలలో అబ్దుల్ కలాం ఒకరు. మొదట కేవలం రాకెట్ల ప్రయోగ కేంద్రముగా ఉన్న తుంబా నెమ్మదిగా రాకెట్లకు అవసర మయిన ప్రొపెల్లర్లు, ఇంజన్లు తయారు చేసి అమర్చ గలిగి పూర్తిస్థాయి రాకెట్ నిర్మాణ కేంద్రంగా తయారయింది. 2.శ్రీహరి కోట: భారత దేశంలో ఉపగ్రహాల ప్రయోగానికి అత్యంత అనువయిన ప్రదేశ మయిన శ్రీహరికోట నెల్లూరు జిల్లాలో సూళ్ళూరుపేట దగ్గర ఉంది.
ఈ అంతరిక్ష కేంద్రం పేరు ‘‘సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం’’. దీనినే ‘‘షార్’’ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశం లోని ఉపగ్రహ ప్రయోగ కేంద్రం. ఇక్కడనుండి ఎన్నో పి.ఎస్ ఎల్. విబీ జి.ఎస్.ఎల్.వి ఉప గ్రహాలను విజయ వంతంగా ప్రయోగించారు. ప్రస్తుతం ఇక్కడ రెండు లాంచ్ ప్యాడ్‌లు ఉన్నాయి. ఈ రెండిటి వల్ల ప్రతి ఏడాది 6 శాటిలైట్లను ప్రయోగించే వీలు ఉంది. 3.బలేశ్వర్ ఒరిస్సాలో ఉంది. శ్రీహరికోటలో ఉన్నట్లు ఇక్కడ శాటిలైట్ల ప్రయోగానికి సౌకర్యాలు లేకున్నా, దీనిని ప్రధానంగా క్షిపణులను ప్రయోగించుటకు ఉపయోగిస్తారు. 2005లో రెండవ లాంచి ప్యాడు ఆపరేషను, 2008 లో చంద్రయాన్, 2014లో మంగళ్ యాన్, 2016లో పునర్వినియోగ లాంచి వాహనపు తొలి పరీక్ష, 2016లో ఒకే రాకెట్టుతో 20 ఉపగ్రహాల ప్రయోగం – అప్పటికి ఇది ఇస్రో రికార్డు, 2017లో ఒకే రాకెట్టుతో 104 ఉపగ్రహాల ప్రయోగం – ఇది ప్రపంచ రికార్డుబీ 2017 – జిఎస్‌ఎల్‌వి మార్క్ 3 ప్రయోగం, దేశీయంగా అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతమైన క్రయోజెనిక్ ఇంజను విజయ వంతమైంది. ప్రసిద్ధమైన ఇస్రో సంస్థ దేశాభివృద్ధి లక్ష్యంగా అంతరిక్ష విజ్ఞానాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఏర్పాటై, ప్రస్తుతం ప్రపంచంలోని అంతరిక్ష రంగ సంస్థల్లో ఒకటిగా పేరొందింది.
బెంగుళూరు కేంద్రంగా ఏర్పాటైన ఇస్రో, దేశంలోని వివిధ ప్రదేశాల్లో పరిశోధన, అభివృద్ధి సౌకర్యాలు కలిగి ఉంది. ఇస్రో భారత ప్రభుత్వపు అంతరిక్ష శాఖకు అనుబంధంగా ఉంది. అంతరిక్ష శాఖ ప్రధాన మంత్రి, అంతరిక్ష కమిషన్ అధీనంలో ఉంటుంది. ఇస్రో కింది విభాగాలను, సంస్థలను నిర్వహిస్తుంది. అంతరిక్ష కార్యకలాపాల లోకి ప్రయివేటు రంగాల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచే లక్ష్యంతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ అంతరిక్ష రంగంలో చాలా కీలకమైన సంస్కరణలకు ఆమోదం తెలిపింది. భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నిర్ణయంతో మన అంతరిక్ష విజ్ఞానాన్ని దేశాభివృద్ధికి ఉపయోగించునే సామర్థ్య మరింతగా పెరుగుతుంది. మన అంతరిక్ష రంగం త్వరిత గతిన అభివృద్ధి చెందటమే కాకుండా.. అంతరిక్ష ఆర్థిక వ్యవహారాల్లో భారత్ అంతర్జాతీయంగా కీలక పాత్ర పోషించేందుకు వీలవుతుంది.
రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494





