అంగన్వాడి టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

తాండూరు ప్రజాతంత్ర ఆగస్ట్ 10; ఎన్నో సంవత్సరాలుగా ఐసిడిఎస్ విభాగంలో పని చేస్తున్న అంగన్వాడీ టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మరకు గురువారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్లు ఆయాలు మహాధర్న చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజా వ్యతిరేక విధానాలపై నిత్యవసర ధరలు పెరిగి ప్రజలు  కార్మిక కర్షక స్కీమ్ వర్కర్స్ తీవ్రంగా భారలు మోపుతుంది అని అదే విధంగా అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ ను  ప్రభుత్వ ఉద్యోగులు గా గుర్తించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని రిటర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని కార్పోరేట్ అనుకూల బిజెపి ప్రభుత్వం  ప్రజా కార్మిక వ్యతిరేక పాలన సాగిస్తున్నదని విమర్శించారు. దీన్ని నిరసిస్తూ ఆగస్టు 9,10 తేదీల్లో మహా ధర్నాలు చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో  తెలంగాణ అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్స్ యూనియన్ తాండూర్ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు బేబీ కార్యదర్శి సుధారాణి ఉపాధ్యక్షులు రాజేశ్వరి మంజుల సంధ్యారాణి  శశికళ శోభ జయంతి  సహాయ కార్యదర్శులు  చంద్రకళ హారతి రాధ బాలమణి వసంత వాణి మారుతమ్మ లక్ష్మి సుజాత తిరుమల అంగన్వాడి టీచర్స్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *