హైదరాబాద్‌ ‌పుప్పాల్‌గూడలో విషాదం

నిర్మాణ సంస్థ రెడీ మిక్స్ ‌ప్లాంట్‌ ‌మిక్సర్‌లో పడి ఇద్దరు మృతి
నార్సింగి, ప్రజాతంత్ర, నవంబర్‌ 4  : ‌నగరంలోని పుప్పాల్‌గూడలో విషాదం నెలకొంది. ఓ నిర్మాణ సంస్థలో ఇద్దరు యువకులు మృతిచెందారు. రెడీమిక్స్ ‌ప్లాంట్‌ ‌మిక్సర్‌లో మృతదేహాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. రెడీ మిక్స్ ‌మిక్సర్‌ ‌క్లీనింగ్‌ ‌చేస్తుండగా ఆపరేటర్‌ ఒక్కసారిగా మిషన్‌ ఆన్‌ ‌చేశాడు.

దీంతో ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు రెడీ మిక్స్ ‌మిక్సర్‌లోపడి మృతిచెందినట్లు సమాచారం. యువకులు మృతిచెందడంలో విషయం తెలుసుకున్న బంధువులు వారు పనిచేసే ప్రాంతానికి వొచ్చి వాగ్వాదానికి దిగారు. అక్కడ ఉన్న ఫర్నీచర్‌ ‌ధ్వంసం చేసి అద్దాలు పగలగొట్టారు. నార్సింగీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *