హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 06 : యూకేలోని అతిపెద్ద ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూప్‌లలో ఒకటైన లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ హైదరాబాద్ నగరంలోని నాలెడ్జ్ సిటీలో తమ లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్(ఎల్టీసీ) కార్యకలాపాలను ప్రారంభించినట్లు లాయిడ్స్ లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాన్ వాన్ కెమెనాడ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ తమ సంస్థ అంతటా ఏఐ, క్లౌడ్, బ్లాక్ చైన్ కార్యకలాపాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ శిరీషా ఓరుగంటి మాట్లాడుతూ ఫుల్ స్టాక్, జావా బ్యాక్ ఎండ్, రియాక్ట్, క్లౌడ్ ఇంజినీర్స్, క్వాలిటీ ఇంజినీర్స్ వంటి స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. భారతదేశ ఆర్థిక అభివృద్ధికి దోహదం చేయడానికి ప్రభుత్వ డిజిటల్ మిషన్‌కు మద్దతు ఇస్తుందన్నారు.




