హరితహారం నర్సరీలలో పనులు ముమ్మరం చేయాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 14 : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం తెలంగాణకు హరితహారం కార్యక్రమంతో మొక్కలు నాటే కార్యక్రమం యజ్ఞంలా కొనసాగుతుందని కడ్తాల్ సర్పంచ్ గూడూరు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి అన్నారు. గ్రామపంచాయతీ పరిధిలో నర్సరీ ఏర్పాటు కోసం మండల పంచాయతీ అధికారి మధుసూదనాచారితో కలిసి స్థల పరిశీలన చేశారు. పల్లెప్రకృతి వనం ప్రాంగణంలో ఉన్న స్థలం నర్సరీకి అనుకూలంగా ఉందని ఎంపీఓ తెలిపారు. సర్పంచ్ మాట్లాడుతూ నర్సరీ పనులు వేగిరం చేయాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. 2024 సంవత్సరానికి గాను 11 వేల మొక్కలు నాటడమే లక్ష్యంగా ప్రభుత్వం నుండి సూచనలు అందాయని తెలిపారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంతో వాతావరణంలో సమతుల్యత  మెరుగై వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రాఘవేందర్, నాయకులు గురిగళ్ల రామచంద్రయ్య, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *