స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఎంఎస్పి నాయకులు పెద్దొల ఆనంద్ కుమార్

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 8: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థి పెద్దొల ఆనంద్ కుమార్ నామినేషన్ వేశారు. బుధవారం తాండూరు పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆర్వో కార్యాలయంలో స్వతంత్ర అభ్యర్థిగా ఎంఎస్పి నాయకులు పెద్దొల ఆనంద్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతం 30 సంవత్సరాలుగా నియోజకవర్గంలో బడుగు వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సమస్యలపై అనేక ఉద్యమాలు పాదయాత్రలు చేసినట్లు గుర్తు చేశారు. నియోజకవర్గంలో 30 నుండి 35 వేల ఓటర్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే ఉన్నారని వారి ఓట్లు ఈనెల 30న జరిగే ఎన్నికల్లో తనకేవేసి  ఎమ్మెల్యే ఎన్నికలు గెలిపించాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కి ఎలాంటి వ్యతిరేకం కాదని రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగానే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుందని ఇందులో భాగంగానే నామినేషన్ వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్ట్ పార్టీ నాయకులు నర్సింలు పిడిఎఫ్ శ్రీనివాస్ సాయినాథ్ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కే నర్సింలు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *