తొలుత లాభాలు..చివరి వరకు నిలవని జోరు
ముంబై, ఫిబ్రవరి 1 : ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపులతోపాటు పలు విషయాల్లో ఊరటనివ్వడంతో బ్జడెట్ రోజున మార్కెట్లు పుంజుకున్నాయి. గతవారం వరకు మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య సాగగా..తాజాగా బ్జడెట్.. సెన్సెక్స్‌కు కొత్త ఊపిరినిచ్చింది. పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సందర్భలో సెన్సెక్స్ 1,180 పాయింట్లు పెరగగా, నిప్టీ 50 దాదాపు 300 పాయింట్ల మేర పెరిగింది. అయితే, చివరకు అమ్మకాల ఒత్తిడి పెరగడంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం మిశ్రమంగా ముగిశాయి.
బడ్జెట్‌పై ఎన్నో ఆశలతో ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన మార్కెట్లు.. బడ్జెట్ ప్రసంగం జరుగుతున్నంత సమయంలో అదే జోరును కొనసాగించాయి. ఓ దశలో సెన్సెక్స్ 1,200 పాయింట్లకు పైగా లాభలో బాటలో పయనించినా ఆ జోరు చివరి వరకు నిలవలేదు. గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు చివరకు కిందకు దిగొచ్చాయి. చివరకు సెన్సెక్స్ 45.85 పాయింట్ల నష్టంతో 17,616.30 వద్ద ముగిసింది.




