హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : సీఎం కేసీఆర్ ఎస్టీ ద్రోహి అని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. సేవాలాల్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేవలం ప్రకటన విడుదల చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. కనీసం సేవాలాల్ మహారాజ్‌ను స్మరించుకునే టైమ్ కూడా సీఎం కేసీఆర్‌కు లేదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అంబేద్కర్ జయంతికి రాడని, సేవాలాల్ మహారాజ్ జయంతిని నిర్వహించడని మండిపడ్డారు. సేవాలాల్ జయంతి కోసం కోటి ఇస్తామన్న కేసీఆర్.. ఆ మొత్తం దేనికి సరిపోతుందని ప్రశ్నించారు.
ఎన్నికల కోసం పోడు భూముల సమస్య పరిష్కరిస్తానని కేసీఆర్ అబద్ధాలు చెప్తుండని బండి మండిపడ్డారు. గిరిజన బంధు సంగతేమైందన్న ఆయన.. బడ్జెట్లో వారికి నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వొస్తే బంజారాహిల్స్‌లో సేవాలాల్ మహరాజ్ దేవాలయం కడతామని హావి• ఇచ్చారు. కొండగట్టుకు వెళ్లిన కేసీఆర్ బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించాలని డిమాండ్ చేశారు.




