సుప్రీమ్‌ కోర్టు తీర్పునే అపహాస్యం చేస్తారా..?

ఎన్నికల బాండ్లపై కేంద్ర మంత్రి నిర్మల వ్యాఖలపై కాంగ్రెస్‌ నేత జైరామ్‌ రమేష్‌ విమర్శ

న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 20 : సుప్రీమ్‌ కోర్టు రాజ్యాంగ విరుద్ధం అంటూ తీర్పు ఇచ్చిన ఎన్నికల బాండ్ల పథకాన్ని తాము తిరిగి అధికారంలోకి వొస్తే.. మళ్లీ తీసుకువస్తామని కేంద్రమంత్రి సీతారామన్‌ ప్రకటించా రని, ‘పే పీఎం స్కామ్‌’ కింద భాజపా రూ.4 లక్షల కోట్లు దోచుకున్న విషయం మనకు తెలిసిందేనని, మళ్లీ ఇప్పుడు ఆ దోపిడీని కొనసాగించాలనుకుంటున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేష్‌ విమర్శించారు.

కేంద్రంలో భాజపా మళ్లీ అధికారంలోకి వొస్తే..ఎన్నికల బాండ్ల పథకాన్ని పునరుద్ధరిస్తామం టూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ఓ వ్నిడియా సంస్థతో మాట్లాడుతూ అనడంపై కాంగ్రెస్‌ తీవ్రంగా విమర్శించిం ది. నిర్మల వ్యాఖ్యలపై జై రామ్‌ రమేష్‌ స్పందిస్తూ..బీజేపీ మళ్లీ అధికారంలోకి వొస్తే ఎంత దోచుకుంటారోనని, అందుకే ఈ ఎన్నికలు అత్యంత ముఖ్యమైనవని, అదృష్టవశాత్తూ ఈ అవినీతి దళం బయటకు వెళ్లిపోతుందని క్షేత్రస్థాయి నివేదికలు వెల్లడిస్తున్నాయని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *