సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 19 : ఆమనగల్లు మున్సిపాలిటీ లోని 15 వార్డులలో సీసీ కెమెరాలు ఏర్పాటు పోలీసు వారికి నేర పరిశోధనలో ఎంతగానో ఉపయోగపడతాయని నేరాల నియంత్రణ జరుగుతుందని ఆమనగల్లు మున్సిపల్ చైర్మన్ నేనావత్ రాంపాల్ నాయక్, కమిషనర్ శ్యాంసుందర్ లు అన్నారు. అమనగల్లు మున్సిపాలిటీ కి సంబందించి 15  వార్డులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయుటకు అమనగల్లు ఎస్సై బలరాంకు చైర్మన్, కమిషనర్, వైస్ చైర్మన్, పాలకవర్గం తో కలిసి రూ.5 లక్షల చెక్కును అందజేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆమనగల్లు మున్సిపాలిటీలో కొన్నిచోట్ల మాత్రమే దాతల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఐదు లక్షలతో అన్ని వార్డులతో కలుపుకొని ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ దుర్గయ్య, కౌన్సిలర్లు చెక్కల లక్ష్మణ్, విజయ్ కృష్ణ, దుడ్డు కృష్ణ, కృష్ణ నాయక్, బిజెపి సీనియర్ నాయకులు బైకని శ్రీశైలం యాదవ్, పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ సింగ్, సీతారాం, రాములు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *