సీనియర్‌ నేత విహెచ్‌కు సిఎం రేవంత్‌ బుజ్జగింపు

అండగా ఉంటానని హావిూ
హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 27 : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావును  సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం కలుసుకుని బుజ్జగించారు. విహెచ్‌కు తాను అండగా ఉంటానని హావిూ ఇచ్చారు. ఇటీవల ఆయన ఖమ్మం లోక్‌సభ టికెట్‌ను ఆశించారు. టిక్కెట్‌ తనకు దక్కే అవకాశం లేదని సమాచారం అందడంతో అలక బూనారు. గత కొన్నిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన..

ఇటీవల విూడియా ముందు అసంతృప్తి వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న సీఎం.. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌తో మాట్లాడారు. బుజ్జగింపుల తర్వాత బుధవారం వి.హనుమంతరావును సీఎం వద్దకు తీసుకెళ్లారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై నేతలు చర్చించారు. వీహెచ్‌కు అన్నివిధాలా అండగా ఉంటానని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.  లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణలోని 17 నియోజకవర్గాలకుగాను ఇప్పటికే 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్‌.. మిగిలిన 8 మందిని బుధవారం ఎంపిక చేయనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *